
వియత్నాంలోని హోచిమిన్ సిటీలో ఓ భారతీయ కుటుంబం ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. అక్కడి ప్రఖ్యాత భారతీయ రెస్టారెంట్లో సిబ్బంది
ని బెదిరించడమే కాకుండా, ఆస్తి నష్టం చేశారని రెస్టారెంట్ యాజమాన్యం ఆరోపించింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.హోచిమిన్ సిటీలోని టూరిస్ట్ ఏరియా అయిన డిస్ట్రిక్ట్ 1లో 'బాంబే బైట్స్ హెచ్సీఎం' అనే భారతీయ రెస్టారెంట్ ఉంది. అక్కడికి వచ్చిన ఓ భారతీయ కుటుంబంలోని పిల్లలు డైనింగ్ ఏరియాలో టిష్యూలు విసురుతూ అల్లరి చేయగా, సిబ్బంది మర్యాదపూర్వకంగా వారి తల్లిదండ్రులకు పరిస్థితిని వివరించారు. పిల్లలను నియంత్రించాలని కోరారు. అయితే, వారు సహకరించకపోగా, రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.ఈ క్రమంలో ఆ కుటుంబం తమపై నోరు పారేసుకోవడంతో పాటు ఆస్తిని ధ్వంసం చేసిందని రెస్టారెంట్ యజమాని ఐశ్వర్య ఖన్నా సింగ్ ఇన్స్టాగ్రామ్లో ఆరోపించారు. తాము 'ఇన్ఫ్లుయెన్సర్లం' అని చెప్పుకుంటూ తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ తమ వద్ద ఉందని తెలిపారు."ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. రెస్టారెంట్ ఆటస్థలం కాదు. మా సిబ్బంది మీ కోపానికి, అహంకారానికి లక్ష్యాలు కారు. ఇన్ఫ్లుయెన్సర్ అయినంత మాత్రాన ఎవరూ కనీస మర్యాదను మించి ప్రవర్తించలేరు. పిల్లలకు బాధ్యత నేర్పించడం, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా చూడటం ప్రతి ఒక్కరి కర్తవ్యం" అని ఐశ్వర్య తన పోస్టులో ఘాటుగా రాశారు. ఆతిథ్యం ఇవ్వడం తమ వృత్తి అని, కానీ కనీస మర్యాద పాటించడం అందరి బాధ్యత అని రెస్టారెంట్ యాజమాన్యం