
తమ కిచెన్లో పేలుడు ఎలా జరిగిందో తెలియదని బాధిత కుటుంబం తెలిపింది. హైదరాబాద్లోని సరూర్నగర్లో మంగళవారం భారీ పేలుడు సంభవించి రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఇల్లు ధ్వంసమైంది. ఘటన జరిగినప్పుడు తన కుమారు
డితో ఇంట్లో ఉన్నట్టు మహిళ తెలిపారు. ‘‘ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. సిలిండర్ పేలిందనుకున్నా. కానీ, అన్నీ బానే ఉన్నాయి. ప్రమాదం ఎలా జరిగిందో తెలియదు. పేలుడు ధాటికి ఇంటి గోడలు, తలుపులు, కిటికీల అద్దాలు దెబ్బతిన్నాయి’’ అని ఆమె చెప్పారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలుడికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఈ వార్త చదివారా: విజయవాడ-హైదరాబాద్ రహదారిపై లారీ ట్యాంకర్ను ఢీకొన్న ప్రైవేటు బస్సు