
"దేశాలను స్టాక్ మార్కెట్లో షేర్లలా చూస్తే, తాను కచ్చితంగా భారత్ షేరునే కొనుగోలు చేస్తాను" అంటూ అమెరికాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ స్టీవ్ డైన్స్ భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారత్ వేగంగా ఎదుగుతోందని, అమెరికాతో ఆ దేశ సంబంధాలు అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. 'ఎన్డీటీవీ' కథనం ప్రకారం.. వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరమ్ (యూఎస్ఐఎస్పీఎఫ్) సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ సెనేట్ ఎన్నికల ప్రచార విభాగానికి స్టీవ్ డైన్స్ అధిపతిగా ఉన్నారు. దీంతో ఆయన ట్రంప్ పార్టీ నాయకత్వానికి అత్యంత సన్నిహితుడిగా, రాజకీయంగా కీలక వ్యక్తిగా గుర్తింపు పొందారు. భారత్ ఆర్థిక వృద్ధిని ఉటంకిస్తూ ఆయన తన ప్రశంసలకు కారణాలను వివరించారు."జీడీపీ దృష్ట్యా చూస్తే ప్రపంచంలోని టాప్ 20 ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఐదో స్థానంలో ఉంది. త్వరలోనే జపాన్ను అధిగమించి నాలుగో స్థానానికి చేరుకోనుంది. అంతేకాదు, ఈ టాప్ 20 దేశాలలో ఈ ఏడాది, వచ్చే ఏడాది కూడా అత్యధిక జీడీపీ వృద్ధి రేటును నమోదు చేయబోయేది భారతే. అందుకే భారత్ ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తోంది" అని డైన్స్ పేర్కొన్నారు.అయితే, ఇదే సదస్సులో మరో సందర్భంలో మాట్లాడిన డెమోక్రాటిక్ పార్టీకి చెందిన భారత సంతతి నేత రో ఖన్నా మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లలో భారత్-అమెరికా సంబంధాలు అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయని