
భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్' (యూపీఐ) తన ప్రపంచవ్యాప్త విస్తరణలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. తాజాగా యూరప్ దేశమైన గ్రీస్‌లో యూపీఐ సేవలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఏథెన్స్లోని యూరోబ్యాంక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూపీఐ ద్వారా లావాదేవీని ప్రత్యక్షంగా ప్రదర్శించారు.ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. గ్రీస్‌లో యూపీఐ సేవలు అందుబాటులోకి రావడంతో అర్హులైన వినియోగదారులు తక్షణమే, అత్యంత సురక్షితంగా నగదు బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే లావాదేవీల ఖర్చు దాదాపు నామమాత్రంగా ఉంటుందని ఆయన వివరించారు. సరిహద్దులు దాటి విలువను సృష్టించడం, ఉమ్మడి వృద్ధి కోసం భాగస్వామ్యాలను పెంపొందించడం లక్ష్యంగా సాంకేతిక పరిష్కారాలను నిర్మించాలన్న ప్రధాని మోదీ దార్శనికతకు ప్రపంచవ్యాప్తంగా యూపీఐకి లభిస్తున్న ఆదరణ నిదర్శనమని గోయల్ తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నారు.తన గ్రీస్ పర్యటనలో భాగంగా గోయల్ యూరోబ్యాంక్ సీఈఓ ఫోకియోన్ కరావియాస్తో సమావేశమయ్యారు. భారత్-గ్రీస్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై ఫలవంతమైన చర్చలు జరిపారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని గ్రీక్ వ్యాపారవేత్తలను ప్రోత్సహించిన ఆయన, గ్రీస్‌లో తయారీ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో సహకారానికి ఉన్న అవకాశాలను అన్వేషించారు. యూరోబ్యాంక్, ఎన్ఐపీఎల్ భాగస్వామ్యంతో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఫెయిర్‌ఫాక్స్ డిజిటల్ సర్వీసెస్ సీఈఓ సంజయ్ తుగ్నైత్ కూడా పాల్గొన్నారు.అంతకుముందు పీయూష్ గోయల్ గ్రీస్ డిప్యూటీ విదేశాంగ మంత్రి హ్యారీ థియోహారిస్తో కలిసి