తలకు గోరువెచ్చని నూనెతో మర్దన చేయడం పురాతన కాలం నుంచి వస్తోంది. ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలంగా మారతాయి. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది.
తద్వారా జుట్టు పల్చబడటం నివారించవచ్చని డెర్మటాలజీ అధ్యయనాలు చెబుతున్నాయి.
ఉల్లిపాయ రసంలోని సల్ఫర్ సమ్మేళనాలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు పల్చబడటం నివారిస్తాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. దీనికోసం ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకుని గంట తర్వాత తలస్నానం చేస్తే మంచిది.
మెంతుల్లో ఫైటోఈస్ట్రోజెన్స్ ఉంటాయి. ఇవి జుట్టుకు కావాల్సిన పోషణ అందించి వెంట్రుకలు రాలకుండా కాపాడుతాయి. జుట్టును ఒత్తుగా మారుస్తాయి. దీనికోసం మెంతులను నానబెట్టి పేస్ట్ చేసి తలకు రాసుకోండి. అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేస్తే మంచిది.
మందారంలోని పోషకాలు జుట్టును నల్లగా, ఒత్తుగా పెరిగేందుకు సహాయపడతాయి. దీనికోసం మందారం పూలు, ఆకులను పేస్ట్ చేసి తలకు రాసుకోండి. కాసేపయ్యాక క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అలోవెరాలోని కూలింగ్, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కుదుళ్ల పీహెచ్ బ్యాలెన్స్ బాగుచేస్తాయి. తద్వారా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. దీనికోసం అలోవెరాను కుదుళ్లకు రాసి మర్దన చేయండి. అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచిది.
ఉసిరిలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి. కుదుళ్లకు రక్త ప్రసరణ మెరుగుపర్చి జుట్టు పల్చబడటాన్ని నివారిస్తాయి. దీనికోసం ఉసిరిని పేస్ట్ చేసి లేదా ఉసిరి రసంను కుదుళ్లకు రాసుకోండి. గంట తర్వాత తలస్నానం చేస్తే మంచిది.
కొబ్బరి నూనె కుదుళ్లకు లోతు నుంచి పోషణ అందించి జుట్టు హెల్తీగా ఉండటంలో సహాయపడుతుంది. ఈ కొబ్బరి నూనెను వేడి చేసి గోరువెచ్చగా అయ్యాక మర్దన చేసుకోండి. గంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.
ఆముదం నూనెను పురాతన కాలం నుంచి జుట్టు పెరుగుదల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ నూనెను కుదుళ్లకు అప్లై చేసి గంట తర్వాత క్లీన్ చేసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
గ్రీన్ టీలో కెటాచిన్స్, పాలీఫినాల్స్ ఉంటాయి. ఇవి కుదుళ్లలో ఇన్ఫెక్షన్స్ నివారించి జుట్టు పల్చబడటాన్ని నివారిస్తాయి. వెంట్రుకలు పొడవుగా పెరిగేందుకు సహాయపడతాయి. దీనికోసం గ్రీన్ టీని తయారుచేసి చల్లారిన తర్వాత దీంతో జుట్టును క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.