
ఈనాడు, అమరావతి: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా మంగళవారం విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సెట్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు.
కమిటీ ఆమోదం తెలిపిన అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరగ్గా 3.29 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను వెబ్సైట్ ద్వారా పొందవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.