
ఇటీవలే 'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో అఖిల్ రాజ్ ఉద్దెమరి వివాదంలో చిక్కుకున్నారు.
ఒక ఫుడ్ డెలివరీ బాయ్ పట్ల ఆయన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, భౌతిక దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలు వివాదం ఏంటి?ఒక ఫుడ్ డెలివరీ బాయ్ పొరపాటున వేరొకరి పార్సిల్ అఖిల్ రాజ్ నివాసానికి తీసుకువచ్చాడు. తన తప్పును గ్రహించి, క్షమాపణలు చెప్పినప్పటికీ హీరో అఖిల్ రాజ్, అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనను బాధితుడైన డెలివరీ బాయ్ స్వయంగా తన ఫోన్లో రికార్డ్ చేశాడు.వైరల్ అవుతున్న ఆ వీడియోలో.. డెలివరీ బాయ్ మెట్లపై నుంచి కిందకు దిగుతుండగా, హీరో అఖిల్ రాజ్ కోపంతో అతని వైపు దూసుకురావడం స్పష్టంగా కనిపిస్తోంది. చేయి చేసుకునేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న కొందరు మహిళలు అఖిల్‌ను ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆయన శాంతించకుండా తీవ్ర స్వరంతో మాట్లాడటం వీడియోలో రికార్డ్ అయింది.బాధితుడి ఆవేదన.. నెటిజన్ల ఆగ్రహంఈ ఘటనపై డెలివరీ బాయ్ మాట్లాడుతూ.. "నేను పొరపాటు జరిగిందని చెప్పి, క్షమించమని కోరాను. అయినా వారు వినలేదు. హీరో నాపై దాడికి ప్రయత్నించారు. అంతటితో ఆగకుండా హీరో తల్లి నా ముఖంపై ఉమ్మివేసి తీవ్రంగా అవమానించారు" అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.