
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
HMDA Mokila plots auction: HMDA పరిధిలోని మోకిల లేఅవుట్లో ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. సోమవారం రెండు విడతల్లో 50ప్లాట్లకు వేలం వేశారు. ఈ ప్లాట్లను కొనేందుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపించారు. 50 ప్లాట్లన్నీ కూడా అమ్ముడుపోయాయి. ఈ రోజు అనగా మంగళవారం మరో 50 ప్లాట్లకు వేలం వేయనున్నారు. ఐటీ సెక్టార్ కు అనుకుని ఉండటంతో మెకిలా లేఅవుట్లో చాలా మంది ప్లాట్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం సర్వేనెంబర్ 96/ఎలో 100 ప్లాట్ల వేలానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
300 నుంచి 500 చదరపు గజాల వరకు ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారు. కనీస ధర గజానికి రూ. 50వేలుగా నిర్ణయించారు. ఒక్కో ఫ్లాట్ కు దరావత్తు రూ. 5లక్షల వరకు నిర్ణయించారు. 2రోజుల క్రితం మేడిపల్లిలో 68 ప్లాట్లకు 63 ప్లాట్లను విక్రయించారు. మోకిలలో కూడా భారీగా డిమాండ్ ఉండటంతో నగర స్థిరాస్తి మార్కెట్ కు తిరుగులేదన్న సంగతి మరో సారి స్పష్టం అయ్యింది. భవిష్యత్తులో ధరలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉండటంతో స్థిరాస్థి సంస్థలు, ఎన్ఆర్ఐలు వ్యాపారులు ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా గతంలో మోకిల లే అవుట్లో 100 ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేస్తే.. చదరపు గజం లక్ష రూపాయల వరకు పలికింది. చందానగర్ సూరారం ప్రాంతాల్లో 60వేలు, నార్సింగిలో 50వేలు, మేడిపల్లిలో 45వేలు, ఫిర్జాదిగూడ బైరాగి గూడలో 40వేలు, బౌరంపేటలో 30వేలుగా అప్ సెట్ ధరలు ఖరారు చేశారు.
జూన్ 17వ తేదీ నుంచి 30 వరకు దశల వారీగా ఈ వేలం నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్ భూమికి జూన్ 19న వేలం జరిగింది. రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం తీసుకురావాలన్న ఉద్దేశ్యంతోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు ఈ వేలం మరో కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉందని చెప్పాలి. ఈ మెగా ఈవేలం ద్వారా అటు రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల భారీ ఆదాయం సమకూరడమే కాదు.. హైదరాబాద్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సత్తాను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పనుంది.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.