
ఇప్పటివరకు వాట్సాప్‌లో కేవలం లైట్ మోడ్, డార్క్ మోడ్ మాత్రమే ఉండేవి. కానీ వాట్సాప్ ప్లస్ తీసుకుంటే మీకు నచ్చిన కలర్ థీమ్స్‌ను సెట్ చేసుకోవచ్చు.
యాప్ లుక్‌ను సరికొత్తగా మార్చేయడానికి అదనపు విజువల్ ఆప్షన్లను మెటా ఇస్తోంది. దీనివల్ల వాట్సాప్ స్క్రీన్ రొటీన్‌గా కాకుండా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది.
మీ మొబైల్ హోమ్ స్క్రీన్‌పై కనిపించే గ్రీన్ కలర్ వాట్సాప్ లోగో చూసి బోర్ కొట్టిందా? అయితే వాట్సాప్ ప్లస్‌లో దాదాపు 14 రకాల డిఫరెంట్ యాప్ ఐకాన్స్ లభిస్తాయి. మీకు నచ్చిన ఐకాన్‌ను సెలెక్ట్ చేసుకుని వాట్సాప్ లోగో ప్లేస్‌లో డిస్ప్లే చేసుకోవచ్చు. దీనివల్ల మీ ఫోన్ హోమ్ స్క్రీన్ చాలా స్టైలిష్‌గా మారుతుంది.
సాధారణ వాట్సాప్ యూజర్లు కేవలం 3 చాట్లను మాత్రమే స్క్రీన్ పైన పిన్ చేసి పెట్టుకోగలరు. కానీ వాట్సాప్ ప్లస్ సబ్స్క్రైబర్లు ఏకంగా 20 చాట్ల వరకు టాప్‌లో పిన్ చేసుకోవచ్చు. ముఖ్యమైన కాంటాక్ట్స్ లేదా గ్రూప్ చాట్లను ఎప్పుడూ పైనే ఉంచుకోవడానికి ఈ ఫీచర్ సూపర్ హెల్ప్ అవుతుంది.
ఈ ప్లాన్ తీసుకున్న వారికి కొన్ని ఎక్స్‌క్లూజివ్ ప్రీమియం స్టిక్కర్ ప్యాక్‌లు లభిస్తాయి. ఇవి నార్మల్ యూజర్లకు అందుబాటులో ఉండవు. వీటితో పాటు స్పెషల్ నోటిఫికేషన్ సౌండ్స్, అదనపు రింగ్‌టోన్ ఆప్షన్స్ వస్తాయి. అంటే ఒక్కో కాంటాక్ట్‌కు లేదా గ్రూప్‌నకు మీ ఇష్టమైన స్పెషల్ సౌండ్స్ సెట్ చేసుకోవచ్చు.
మీ వాట్సాప్‌లో వందల కొద్దీ మెసేజ్‌లు వచ్చి పడుతున్నాయా? అయితే చాట్ లిస్ట్‌ను ఆర్గనైజ్ చేయడానికి ఇందులో అదనపు కంట్రోల్స్ టూల్స్ లభిస్తాయి. కస్టమ్ లిస్ట్‌లను క్రియేట్ చేసుకుని మీ చాటింగ్‌ను చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అవసరమైన చాట్లను వెతుక్కునే పని తప్పుతుంది.
ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.. వాట్సాప్ ప్లస్ అనేది కేవలం యాప్ లుక్ ను కస్టమైజేషన్ తీసుకొచ్చిన ప్లాన్ మాత్రమే. దీనివల్ల మీ ప్రైవసీ, సెక్యూరిటీ లేదా కాల్ క్వాలిటీలో ఎలాంటి మార్పులు ఉండవు. మెసేజింగ్ స్పీడ్ పెరగడం కానీ, ఎక్కువ స్టోరేజ్ రావడం కానీ జరగదు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, వాయిస్, వీడియో కాల్స్, మీడియా షేరింగ్ వంటి నార్మల్ ఫీచర్లు ఎప్పటిలాగే అందరికీ ఉచితంగానే అందుబాటులో ఉంటాయి.
ఈ ఫీచర్లు కావాలనుకునే వారు యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, సబ్స్క్రిప్షన్ విభాగంలో వాట్సాప్ ప్లస్ ఆప్షన్ ద్వారా నెలకు ₹79 పే చేసి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. మొదటి నెల ట్రయల్ పీరియడ్ ఉచితంగా లభిస్తుంది.