
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Chandrababu Tour: ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా పారిశ్రామికీకరణ జరుగుతోంది. ఏపీలో మరో కీలక కంపెనీ ప్రారంభానికి సిద్ధం కానుంది. సత్యవేడులో రేపు హీరో కంపెనీ తన జీపీస కేంద్రానికి శంకుస్థాపన చేసుకోనుంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తోంది. అంతేకాకుండా రేపు లబ్ధిదారులందరికీ కూడా పింఛన్ పంపిణీ చేయనున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొనేందుకు రేపు తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లాల పర్యటన ఖరారైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మదనపాలెంలో హీరో మోటార్ కార్ప్స్ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్-జీపీసీకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు శంకుస్థాపన చేయనున్నారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని మదనపాలెంలో హీరో మోటార్ కార్ప్స్ నూతనంగా ఏర్పాటు చేయనున్న జీపీసీకు భూమిపూజ జరగనుంది. హీరో మోటార్స్‌కు చెందిన వివిధ తయారీ కేంద్రాలు, డీలర్లకు ద్విచక్ర వాహనాల విడి భాగాలను తయారు చేసి సరఫరా చేసేలా ఆ సంస్థ ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
4 వేల మందికి ఉద్యోగ, ఉపాధి రూ.750 కోట్ల పెట్టుబడితో హీరో మోటార్ కార్పోరేషన్ ఈ జీపీసీ 2.0ను సత్యవేడులో నిర్మించనుంది. దీనిద్వారా స్థానికంగా 4 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనుండడంతో ఇక్కడి ప్రజల ఆర్థిక స్థితిగతులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే శ్రీసిటీ సమీపంలో హీరో మోటార్స్ సంస్థ ఏర్పాటుచేసిన అధునాతన ద్విచక్ర వాహనాల తయారీ ప్లాంట్‌లో ఏడాదికి 1.5 మిలియన్ల వాహనాలను ఉత్పత్తి జరుగుతున్న విషయం తెలిసిందే.
స్కాలర్ షిప్ దేశ, విదేశాల్లో ఉన్న మోటార్ సైకిళ్లు, స్కూటెక్లు, ఈవీలకు విడి భాగాలను తయారుచేసేందుకు ఈ జీపీసీను హీరో మోటార్స్ ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే పీ4 కార్యక్రమంలో మార్గదర్శిగా ఉన్న హీరో మోటార్స్ సంస్థ పలువురికి స్కాలర్ షిప్‌లను ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ద్వారా హీరో మోటార్స్ అందించనున్న బ్రిజ్ మోహన్ లాల్ ముంజల్ పేరుతో హీరోస్ ఆఫ్ టుమారో పేరిట స్కాలర్షిప్లను రేపు సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. ఇక ఈ కంపెనీకి చెందిన వాహనాలను ఏపీ పోలీస్ శాఖకు కూడా కేటాయించాలని నిర్ణయించారు. ఏపీ పోలీసులు వినియోగించుకునేలా హీరో మోటార్స్ సంస్థ ప్రత్యేకంగా తయారుచేసిన ఎలక్ట్రిక్ మొబిలిటీ వాహనాలను కూడా సీఎం చంద్రబాబు అందించనున్నారు.
పింఛన్ల పంపిణీ ఎన్టీఆర్ భరోసా ఫించన్లు జూలై 2026కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పున్నపువారిపాలెం గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పేదల సేవా కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. వృద్ధాప్య, వితంతు సహా వేర్వేరు కేటగిరీలకు చెందిన 62 లక్షల మంది లబ్దిదారులకు రూ.2,750 కోట్ల మేర ఏపీ ప్రభుత్వం పింఛన్ అందిస్తున్న విషయం తెలిసిందే. పున్నపువారిపాలెం గ్రామంలో ఓ లబ్దిదారు ఇంటికి వెళ్లి సీఎం చంద్రాబు స్వయంగా పింఛన్‌ను పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నారు. రాత్రికి శ్రీసిటీలో ఉన్న అతిథి గృహంలో ముఖ్యమంత్రి బస చేయనున్నారు.