కన్నాని చూసేందుకు మహాలక్ష్మీ తిరిగి వస్తుంది. ఉండిపోవడానికి రాలేదు అని మహా అంటుంది. ఉండిపోవచ్చు కదా.. మాకు బుద్దులు నేర్పించొచ్చు కదా అని నారాయణ అంటాడు. నేనేమీ ట్యుటోరియల్ పెట్టుకోలేదు అని మహా అంటుంది
. లోపలకు వెళ్లి పరిస్థితిని చూసి షాక్ అవుతుంది. ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. కన్నాగాడు అలా పడుకుని ఉంటాడు. ఏంటి ఇదంతా? ఇలా ఉంటే.. కన్నా గాడికి ఇంకా ఇన్ ఫెక్షన్ అవ్వదా? మేం బయట కూర్చుంటాం.. అంతా క్లీన్ చేయండని చెప్పి వెళ్తుంది మహా. దీంతో పెద్ది, చక్రి, కేశవ అందరూ కలిసి ఇంటిని క్లీన్ చేస్తారు. అసలు మీరు కన్నాని ఎందుకు వదిలి వెళ్లారు పెద్ది.. మీరైనా ఉండొచ్చు కదా? అని మహా అంటుంది. వీడు (చక్రి) ఉంటానని అన్నాడు.. మధ్యలో వదిలేసి వెళ్లాడు అని పెద్ది చెబుతాడు. నేను ద్రాక్ష పండ్ల కోసం వెళ్లాను..దొరకలేదు అని అబద్దం చెబుతాడు చక్రి. కానీ మహా మాత్రం అసలు చక్రి మాటల్ని పట్టించుకోదు. అతని వైపు కూడా చూడు. ఇలా మధ్యలో దూరి మాట్లాడాలని చాలా ప్రయత్నిస్తాడు. కానీ మహా మాత్రం అస్సలు చూడదు, పట్టించుకోదు. నాకు ఒక టీ పెట్టు పెద్ది.. అక్కడ బాగోదు.. తాగడమే మానేశా అని మహా అంటుంది.చక్రి అన్ననే బయటకు పంపించేద్దాం నువ్వు వంద సార్లు మాట్లాడాలని చూసినా..తను మాత్రం నీతో మాట్లాడదు అని చక్రికి కేశవ కౌంటర్లు వేస్తాడు. వదిన.. మీరు ఇక్కడే ఉండిపోవచ్చు కదా? మీకు చక్రి అన్నయ్యతోనే ప్రాబ్లం కదా.. చక్రి అన్ననే బయటకు పంపించేద్దాం అని కన్నా అంటాడు. బయట ట్రావెల్స్‌లోనే పడుకుంటాడు.. అని కన్నా అంటాడు. దీంతో చక్రి షాక్ అవుతాడు. కేశవ నవ్వేస్తాడు. నా చుట్టూనే ద్రోహులున్నారు అని చక్రి అనుకుంటాడు. లోపల ఏం జరుగుతుందో.. ఇంట్లోనే ఉండిపోతే బాగుండు అని నారాయణ బీడీల బీడీలు కాల్చేస్తుంటాడు. ఇక మహాకి దోశ, కన్నాకి ఇడ్లీని తెచ్చి పెడతాడు పెద్ది.నీ మొహం కూడా చూడటం లేదు.. ఇంత వరకు తినమంటే తినలేదు అని పెద్ది అంటాడు. నువ్వు వచ్చాకే లేచాడు, ఇలా తింటున్నాడు అని మహాకి పెద్ది చెబుతాడు. అందుకే వచ్చాను కదా అని పెద్ది అని మహా అంటుంది. మీ చేతి వంట తిన్నాక.. ఎక్కడా తినబుద్ది కావడం లేదు అని మహా అంటే.. ఇక్కడే ఉండిపోండి.. ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చక్రి అంటాడు. రేయ్.. నిన్ను నోర్మూసుకుని ఉండమని చెప్పాను కదా అని పెద్ది ఫైర్ అవుతాడు. నీ మొహం కూడా చూడటం లేదు.. నీకు సమాధానం చెప్పడం లేదు.. అని కేశవ.. నీ వల్లే మాకు దూరమైంది అని కన్నా ఇలా తలా ఒక మాటలతో చక్రిని బాధపెడతారు.ఇంట్లో దరిద్రం తాండవిస్తోంది.. కన్నాకి జాగ్రత్తలు చెప్పి ఆఫీసుకి బయల్దేరుతుంది మహా. చక్రి నిన్ను డ్రాప్ చేస్తాడు అని పెద్ది కాస్త హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాడు. వద్దు అని మహా అంటుంది. వాడు ఖాళీగానే ఉన్నాడు కదా డ్రాప్ చేస్తాడు అని కేశవ అంటాడు. నేను వెళ్లగలను అని మహా అంటుంది. ఇంట్లో దరిద్రం తాండవిస్తోంది.. ఇలానేనా ఇల్లు ఉంచుకునేదని అందరినీ తిడుతుంది మహా. మా ఇంటి మహాలక్ష్మీ వెళ్లిపోయింది.. అందుకే దరిద్రదేవతకు దారి దొరికింది అని నారాయణ అంటాడు. ఆపేవాళ్లు లేరనా? ఇలా బీడీల మీద బీడీలు కాల్చేస్తున్నారు అని నారాయణ మీద ఫైర్ అవుతుంది మహా. నువ్వు ఉండిపోతే తగ్గిస్తా అని నారాయణ అంటాడు.. పెద్ది నేను వెళ్తున్నాను అని మహా చెప్పి వెళ్తుంది.బస్తీవాసుల మాటలకు.. ఇక కన్నా గాడు గుడికి వెళ్దామని అడగడంతో ఆఫీసుకు వెళ్లకుండా ఓ గంట ఆగుతుంది మహా. నేను కూడా వెళ్లి కన్విన్స్ చేస్తా అని స్కూటీ వేసుకుని చక్రి వెళ్తాడు. దారి పొడవునా మహాని, కన్నాని అందరూ ఎగతాళి చేస్తుంటారు. మీ వదిన వెళ్లిపోయింది కదా మళ్లీ వచ్చిందా? మా లెక్క ప్రకారం నువ్వు రాకూడదు కదా.. నగలు, బట్టలు తీసుకు వెళ్లేందుకు వచ్చినట్టుంది.. వీధి అంతా అలానే మాట్లాడుకుంటూ ఉంటుంది.. ఆ కొంపలో ఆడవాళ్లే ఉండరు.. అది శాపం కదా అని అంతా అనుకుంటూ ఉంటారు. అవన్నీ విని మహా బాధపడుతుంది. ఇవన్నీ మాకు కొత్తేం కాదు అని కన్నా అంటాడు. అందరూ అనుకునేదే నిజమైంది ఏంట్రా అని మహా అంటుంది.1116 పొర్లు దండాలు పెట్టాలి.. మీరు కూడా ఇదే గుడికి వచ్చారా? అని చక్రి అంటాడు. నువ్వే మేం వస్తున్న గుడి గురించి తెలుసుకుని ఇక్కడకు వచ్చావ్ అని కన్నా అంటాడు. ఇక అక్కడ గుడిలో అర్చనా? అభిషేకమా? అని పంతులు అడిగితే.. ప్రాయశ్చిత్తం అని చక్రి అంటాడు. అలాంటి పూజ లేదు అని పంతులు అంటాడు. తప్పు చేశాను అని చక్రి అంటే.. పెద్ద తప్పు అని కన్నా, క్షమించరాని తప్పు అని మహా అంటుంది. మీరు అలా హార్ష్‌గా మాట్లాడకండి.. అని చక్రి అంటాడు. చేసిన తప్పు పోవాలంటే 1116 పొర్లు దండాలు పెట్టాలని చెప్తే.. వేరే ఆప్షన్ లేదా? అని చక్రి అడుగుతాడు. అవతలి వాళ్లు క్షమించాలని పంతులు అంటే.. అది జరగని పని అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేస్తుంది మహా.ముందు వెళ్లండి.. తర్వాత ఆలోచిస్తా ఏవండి.. ఆగండి అని చక్రి అంటాడు. ఏంటి మీ గోల అని చక్రి మీద చిరాకు పడుతుంది. నాది గోల కాదు.. గోడు అని చక్రి అంటాడు. సరే చేతిలో కర్పూరం వెలిగించుకుని దేవుడికి హారతివ్వు ఆలోచిస్తా అని అంటుంది మహా. రోజంతా ఇస్తానని బిల్డప్ ఇస్తాడు చక్రి. నిమిషం కూడా అవ్వకముందే కాలిందని కింద పడేస్తాడు. కాలిందా? ఇక మీ ఓవర్ యాక్షన్ ఆపండి.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటుంది మహా. కన్నా చెప్పినట్టు నేను ఇంట్లోంచి వెళ్లిపోతే మీరు ఇంట్లోకి వస్తారా? అని చక్రి అంటాడు.. ముందు వెళ్లండి.. తర్వాత ఆలోచిస్తా అని మహా అంటుంది. ఆ మాటకు నిజంగానే చక్రి బాధపడతాడు.మిమ్మల్ని విడగొట్టడానికి నేను ఎవర్ని రా.. చక్రి అన్నయ్య ఇంట్లోంచి వెళ్లిపోతే నిజంగానే మీరు వస్తారా? అని కన్నా అడుగుతాడు. నేను ఎవర్నిరా మిమ్మల్ని విడగొట్టడానికి.. మీది రక్త బంధం.. మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేదు.. మీరంతా కలిసే ఉంటారు.. అప్పుడే బృందావనానికి అందం.. అని మహా అద్భుతంగా చెబుతుంది. ఇక వెళ్దాం.. ఆఫీసుకి టైం అవుతుందని మహా, కన్నా బయల్దేరుతారు. అదే టైంకి తాయారు వస్తుంది. ఏంటమ్మ నన్ను గుర్తు పట్టలేదా? గాయత్రి అమ్మని అని తాయారు అంటుంది. మీరేంటి ఇక్కడ అని చూస్తున్నా అని మహా కూడా కౌంటర్ వేస్తుంది.ఆ మనుషుల్ని కూడా తొందరగా వదిలించుకో.. కొంపలోంచి వెళ్లిపోయావ్ అంట కదా.. కంగ్రాట్స్.. నీకు ముందే చెప్పా కదా.. ఇలానే జరుగుతుందని.. కానీ నువ్వే నమ్మలేదు.. ఇప్పటికైనా అర్థమైందా? ఆ ఇల్లు ఎలాంటిదో.. మనుషులు ఎలాంటి వారో.. నేను ఆ ఇంట్లో పుట్టి పెరిగిన దాన్నే కదా.. అందుకే నా కూతుర్ని కోడలుగా పంపించలేదు.. అవన్నీ నీకు తెలీదు కదా.. తొందరగానే కళ్లు తెర్చుకుని.. బయటకు వచ్చావ్.. ఆ మనుషుల్ని కూడా తొందరగా వదిలించుకో.. నీకు మంచిది.. అని ఇలా లేనిపోనివి అన్నీ అనేస్తుంది తాయారు. ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు.. వచ్చిన వాళ్లు వచ్చినట్టే పోతారు అని తాయారు అంటుంది.ఇదంతా నా వల్లే కదరా ఇదంతా నా వల్లే కదరా.. అందరూ మిమ్మల్ని అంటున్నారు అని మహా బాధపడుతుంది. మీరు రాక ముందు ఈ శాపాల గురించి నమ్మేవాడ్ని కాదు.. మీరు వెళ్లిపోయాక ఆవిడ చెప్పిందే నిజం అని, శాపం ఉందని అర్థమైంది అని కన్నా అంటాడు. మా జీవితాలు అంతే .. తలరాతను మార్చుకోలేం కదా.. అని కన్నా ఎమోషనల్‌గా అంటాడు. ఇక మహా తన మనసులో ఏదో ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఆఫీసులో కుమార్ గాడు.. మహా మహా అని అరిచేస్తుంటాడు. ఎందుకు లేటుగా వచ్చావ్ అని నిలదీస్తాడు కుమార్. సారీ చెప్తే తప్పు ఒప్పు అవుతుందా.. అని కుమార్ తిడతాడు. పొద్దున్నే ఫైల్ పంపాల్సి ఉంది.. అది పంపలేదు.. అని కుమార్ అంటాడు.ఆఫీసులో సంతోష్ కుమార్ ఆగమాగం.. కానీ మహా మాత్రం ఎక్కడో ఉంటుంది. తాయారు మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ ఫైల్ విక్కీ దగ్గర క్లియరెన్స్ కోసం పెట్టాను అని మహా అంటుంది. ఇక ఇంతలో విక్కీ వచ్చి సంతోష్‌ని తిడతాడు. జూనియర్లను ఇలా హ్యాండిల్ చేస్తారా? ప్రేమగా చెప్పి మనకు కావాల్సిన పనిని చేయించుకోవాలని అంటాడు. ఆయనేమీ తిట్టడం లేదు సర్ అని మహా అంటుంది. చూశావా? నేను తిట్టలేదు.. నేనేం చేసినా కంపెనీ కోసం చేస్తా.. నువ్వు మాత్రం నన్నే అంటావ్ అని సంతోష్ వెళ్లిపోతాడు.రేయ్ పెళ్లి కాని కుమార్ అని విక్కీ కామెడీ చేస్తాడు. దీంతో అందరూ నవ్వేస్తారు.Screenshot 2026-06-30 065617