
విద్యుత్తు వాహనాలకే రిజిస్ట్రేషన్ వచ్చే ఏడాది నుంచి విద్యుత్తు ఆటోలకే అనుమతి 2030 నాటికి కాలుష్య రహితంగా దేశ రాజధాని ప్రత్యేక ఈవీ పాలసీకి ఆమోదం దిల్లీ: దేశ రాజధాని దిల్లీని 2030 నాటికి కాలుష్య రహిత...
విద్యుత్తు వాహనాలకే రిజిస్ట్రేషన్ వచ్చే ఏడాది నుంచి విద్యుత్తు ఆటోలకే అనుమతి 2030 నాటికి కాలుష్య రహితంగా దేశ రాజధాని ప్రత్యేక ఈవీ పాలసీకి ఆమోదం
దిల్లీ: దేశ రాజధాని దిల్లీని 2030 నాటికి కాలుష్య రహిత నగరంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విద్యుత్తు వాహనాలను ప్రజలు కొనుగోలు చేసేందుకు వీలుగా భారీగా పన్ను రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటించింది. దీంతోపాటు 2027 జనవరి నుంచి విద్యుత్తు ఆటోలు, 2028 ఏప్రిల్ నుంచి విద్యుత్తు ద్విచక్ర వాహనాలకే రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించింది. అప్పటి నుంచి పెట్రోలు, సీఎన్జీ వాహనాల రిజిస్ట్రేషన్లను అనుమతించరు. సోమవారం ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలో సమావేశమైన క్యాబినెట్.. ప్రత్యేక ఈవీ (విద్యుత్తు వాహనాల) పాలసీకి ఆమోద ముద్ర వేసింది. కొత్త విధానంలో భాగంగా జులై 1వ తేదీ నుంచి రూ.30 లక్షల లోపు విద్యుత్తు వాహనాలపై జీవితకాల పన్నును, రిజిస్ట్రేషన్ ఛార్జీలను ప్రభుత్వం ఎత్తివేస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.