
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన వార్షిక షాపింగ్ ఈవెంట్ "ప్రైమ్ డే 2026" సేల్ తేదీలను అధికారికంగా ప్రకటించింది.
భారత్‌లో ఈ సేల్ జూలై 4వ తేదీ అర్ధరాత్రి నుంచి ప్రారంభమై జూలై 6వ తేదీ వరకు, మొత్తం 72 గంటల పాటు కొనసాగనుంది. ప్రైమ్ సభ్యుల కోసం ప్రత్యేకంగా నిర్వహించే ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్లు, గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. భారత్‌లో ప్రైమ్ సేవలు ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సేల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్ఫోన్లపై అమెజాన్ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. బ్యాంక్ ఆఫర్లతో కలిపి శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా సుమారు రూ. 84,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉండనుంది. కొత్తగా విడుదలైన శాంసంగ్ గెలాక్సీ M47 5G ఫోన్‌ను రూ. 22,999కి, వన్‌ప్లస్ 13ను రూ. 49,999కి విక్రయించనున్నారు. రెడ్మీ, ఐకూ, రియల్మీ వంటి ఇతర ప్రముఖ బ్రాండ్ల ఫోన్లు కూడా ఆకర్షణీయమైన ధరలకే లభించనున్నాయి. ఇక ల్యాప్‌టాప్‌ల విభాగంలో హెచ్‌పీ ఓమ్నీబుక్ సుమారు రూ. 68,990 ధరలో ఉండగా, డెల్ మోడళ్లు రూ. 60,990 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటాయి.వీటితో పాటు శాంసంగ్, టీసీఎల్, ఎల్జీ, సోనీ వంటి అగ్రశ్రేణి బ్రాండ్ల స్మార్ట్ టీవీలపై గరిష్ఠంగా 75 శాతం వరకు తగ్గింపును ప్రకటించారు. ఎంపిక చేసిన లావాదేవీలపై ఎస్బీఐ (SBI), యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు హోల్డర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్