
డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 684 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను రెన్యువల్ చేస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అమరావతి, జూన్ 29(ఆంధ్రజ్యోతి): డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 684 మంది
కాంట్రాక్టు లెక్చరర్ల సేవలను రెన్యువల్ చేస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. జూన్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30 వరకు వీరి సేవలు కొనసాగుతాయని తెలిపింది. మొత్తంగా 11 నెలల కాలానికి కాంట్రాక్టు లెక్చరర్లకు జీతాలు అందుతాయి.