
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Rythu Bharosa Amount: తెలంగాణ రైతులకు భారీ శుభవార్త. పంట పెట్టుబడి సహాయంగా అందించే రూ.6 వేలు రేపు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం రేపు రైతులకు డబ్బులు వేయనుంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతు ఆశీర్వాద సభ వేదిక మార్చివేసి హైదరాబాద్‌కు మార్చారు. రైతు భరోసా నిధుల విడుదల యథావిధిగా కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించారు. హైదరాబాద్‌లోని శిల్పాకళావేదిక నుంచి రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. మొదటి విడతలో రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతులకు రూ.2,482.02 కోట్లు జమ చేయనుంది.
మెగా రైతు మేళా రద్దు రైతు భరోసా నిధుల విడుదలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభ వేదికను మార్చినట్లు తెలిపారు. రైతుల భద్రత, ప్రజాప్రతినిధుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని.. మధిరలో రైతుల కోసం భారీ ఎత్తున ఏర్పాటుచేయాలనుకున్న 'మెగా రైతు మేళా'ను కూడా నిర్వహించడం సాధ్యం కాలేదని మంత్రి వివరించారు.
రైతుల ఖాతాల్లో జమ వర్షాలు విస్తరిస్తుండటంతో రైతులు విత్తనాలు వేసే అత్యంత కీలక సమయంలోనే రైతు భరోసా పెట్టుబడి సహాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలంగాణ మంత్రి తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేకుండా రైతు భరోసా నిధులను రేపు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నట్లు.. అక్కడ రైతు భరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని మంత్రి వెల్లడించారు.
రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు 'రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అందాల్సిన పెట్టుబడి సహాయాన్ని అందించాలనే దృఢసంకల్పంతో రైతు భరోసా నిర్వహిస్తాం. రైతులు విత్తనాలు వేసే సమయంలోనే ఆర్థిక భరోసా అందించడం ద్వారా సాగు వ్యయభారాన్ని తగ్గించడంతో పాటు వ్యవసాయ కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది' అని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ బృహత్తర కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.32 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు దశలవారీగా జమ చేయనున్నారు. తొలి విడతలో రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లను ప్రభుత్వం జమ చేయనుంది.
కొత్తగా పాస్ పుస్తకాలు తొలి విడతలో ఒక ఎకరం, మరో విడతగా రెండు ఎకరాలు కలిగిన రైతులకు డబ్బులు జమ చేయనుండగా.. తర్వాత మిగిలిన రైతులకు దశలవారీగా రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు జూలై 5వ తేదీలోపు సమీప వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి బ్యాంకు అకౌంట్ వివరాలు సమర్పిస్తే రైతు భరోసా పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
రైతు భరోసా వివరాలు తొలి విడతలో ఒక ఎకరం వరకు భూమి కలిగిన 14.65 లక్షల మంది రైతుల కోసం రూ.878.94 కోట్లు రెండు ఎకరాల వరకు భూమి కలిగిన 26.72 లక్షల మంది రైతుల కోసం రూ.1,603.08 కోట్లు