
తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 36 మంది డీఎస్పీలు ఒకేసారి బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 36 మంది డీఎస్పీలు ఒకేసారి బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌ మెంట్ బోర్డ్(పీఈబీ) చేసిన సిఫార్సుల మేరకు ఈ బదిలీల ప్రక్రియ జరిగినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న స్థానాలో పోస్టింగ్ లు కల్పించేందుకు ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక బదిలీ అయిన అధికారులను సీఐడీ, ఏసీబీ, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, వివిధ జిల్లాల ఏసీపీ పోస్టులు తదితర కీలక విభాగాల్లో నియమించారు.ఇక రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం, శాంతిభద్రతల పరిరక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఈ బదిలీలు చేపట్టినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. బదిలీ అయిన డీఎస్పీల వివరాలు ఇలా ఉన్నాయి. పీ. శ్రీశైలం ఏసీపీ సీసీఎస్ నిజామాబాద్, సంకెళ్ల వెంకటేశ్ డీఎస్పీ, సీఐడీ, కంపా రవీందర్ ఏసీపీ, సీసీఎస్ రామగుండం, సీ విజయరాజు డీఎస్పీ, పీసీఎస్, జీ. వెంకటేశ్వర్లు డీఎస్పీ, ఎస్బీ, సిరిసిల్ల, బొబ్బల ప్రవీణ్ డీఎస్పీ, ఇంటెలిజెన్స్, బూర శ్రీనివాస్ డీఎస్పీ రోడ్ సేఫ్టీ, ఎం. వెంకట నర్సయ్య డీఎస్పీ, జీ మహేందర్ రెడ్డి డీజీ, ఏసీబీ, గొర్ల సీతారెడ్డి డీజీ, వీ అండ్ ఈ, బీ బాలాజీ ఏసీపీ, అడపా నరసింహారావు ఏసీపీ, సీసీఆర్బీ ఖమ్మం..ఎం. వెంకట రామయ్య డీఎస్పీ, రాజీవ్ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్, పబ్బతి వెంకటేశ్వర్లు డీఎస్పీ, సీఐడీ, కీత రామకృష్ణ ఏసీపీ, సీఎస్డబ్యూ హైదరాబాద్, కోస్గి భాస్కర్ డీఎస్పీ, డీసీఆర్బీ, కరుణాకర్ ఏసీపీ, హైదరాబాద్, ఎం. వెంకట్ రెడ్డి డీఎస్పీ, పార రాజు డీఎస్పీ, నూనె వెంకటేశ్వర్లు డీజీ, జీ గోవర్థనగిరి ఏసీపీ, ఎస్. వెంకటేశ్ ఏసీపీ, గురునాయుడు ఏసీపీ, భూపతి గట్టుమల్లు డీఎస్పీ, హరినాథ్ బాబు ఏసీపీ, రాజా రెడ్డి డీఎస్పీ, నరేందర్ ఏసీపీ, రాజయ్య డీఎస్పీ తదితరులు ఉన్నారు.