
తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలో కీలక మార్పులు చేపట్టింది. పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కొత్త పోస్టింగులు ఇచ్చింది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు శాఖలో ఐపీఎస్, ఎస్పీఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగులు చేపట్టింది. ఈ మేరకు జీఓ ఆర్.టి. నెం.931ను జారీ చేసింది. పలువురు అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించగా, మరికొందరికి అదనపు బాధ్యతలు కేటాయించింది.
రామగుండం పోలీస్ కమిషనర్‌గా కొనసాగుతున్న అంబర్ కిశోర్ ఝాకు డీఐజీ, జోన్-1 (కాళేశ్వరం) అదనపు బాధ్యతలు అప్పగించారు.
హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి. జోయెల్ డేవిస్‌కు డీఐజీ, జోన్-5 (యాదాద్రి) బాధ్యతలు కూడా అప్పగించారు.
వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సున్‌ప్రీత్ సింగ్‌ను సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ, డీఐజీ జోన్-3 (రాజన్న) అదనపు బాధ్యతలు ఇచ్చారు.
హైదరాబాద్ నార్త్ రేంజ్ (లా అండ్ ఆర్డర్) జాయింట్ కమిషనర్‌గా ఉన్న ఎన్. శ్వేతను వరంగల్ పోలీస్ కమిషనర్‌గా నియమిస్తూ, డీఐజీ జోన్-4 (భద్రాద్రి) బాధ్యతలు కూడా అప్పగించారు.
ఇంటెలిజెన్స్ సీఐ సెల్ డీఐజీగా కొనసాగుతున్న ఆర్. భాస్కరన్‌కు జోన్-2 (బాసర) డీఐజీ అదనపు బాధ్యతలు కేటాయించారు. స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ఎస్.ఎం. విజయ్ కుమార్‌కు హైదరాబాద్ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న చి. సింధు శర్మను ఇంటెలిజెన్స్ సీఐ సెల్ ఎస్పీగా బదిలీ చేసి, ఎస్ఐబీ ఎస్పీ బాధ్యతలు కూడా అప్పగించారు. ఎస్ఐబీ ఎస్పీగా ఉన్న వై. సాయి శేఖర్‌ను సికింద్రాబాద్ రైల్వే పోలీస్ ఎస్పీగా బదిలీ చేశారు.
హైదరాబాద్ డీసీపీ (ఎస్ఎం అండ్ ఐటీ)గా ఉన్న చెన్నూరి రూపేష్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ చి. ప్రవీణ్ కుమార్‌లను సీఐడీ ఎస్పీలుగా నియమించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఆర్. వెంకటేశ్వర్లును హైదరాబాద్ సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీగా నియమించారు.
వనపర్తి అదనపు ఎస్పీ (అడ్మిన్)గా ఉన్న రాజేష్ మీనాను వికారాబాద్ అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు. వికారాబాద్ అదనపు ఎస్పీ (అడ్మిన్)గా ఉన్న బి. రాములు నాయక్‌ను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసి, డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?