
ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడుతుండగా మహిళా గేట్ కీపర్ కాపాడిన ఘటన అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జరిగింది.
నాగరాజుపేట రైల్వే డబుల్ క్రాసింగ్ సమీపంలో సిగ్నల్ పాయింట్ వద్ద రైలు వస్తుండగా ఓ వ్యక్తి పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. విధుల్లో ఉన్న మహిళా గేట్ ఉద్యోగి గమనించి అక్కడున్నవారిని అప్రమత్తం చేశారు. దీంతో కొందరు యువకులు అక్కడికి చేరుకుని అతణ్ని పక్కకు లాగారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే ఆ వ్యక్తి మద్యంలో మత్తులో ఉన్నాడని సమాచారం. ఈ వార్త చదివారా: వాయిస్ మెసేజ్లు పెట్టినా ఫిర్యాదులుగా స్వీకరించాలి: సీఎం చంద్రబాబు