
సాధారణంగా ఒక డెబ్యూ హీరోయిన్ రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది.. మహా అయితే 10 లక్షలు.. బాగా స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ అయితే ఒక 50 లక్షలు. కానీ, ఒక హీరోయిన్ తన మొదటి సినిమాకే ఒక కోటి అందుకున్నదట.
సాధారణంగా ఒక డెబ్యూ హీరోయిన్ రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది.. మహా అయితే 10 లక్షలు.. బాగా స్టార్ డమ్ ఉన్న హీరోయిన్ అయితే ఒక 50 లక్షలు. కానీ, ఒక హీరోయిన్ తన మొదటి సినిమాకే ఒక కోటి అందుకున్నదట. ఏంటి.. నిజమా.. ఎవరా హీరోయిన్ అంటే.. బాలీవుడ్ సీనియర్ బ్యూటీ రవీనా టాండన్ గారాల పట్టి రషా తడానీ (Rasha Thadani). సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని (Jayakrishna Ghattamaneni) హీరోగా పరిచయమవుతున్న తాజా చిత్రం శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram). ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి విలక్షణ చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ లవ్ అండ్ యాక్షన్ డ్రామాను సీనియర్ ప్రొడ్యూసర్ సి. అశ్విని దత్ సమర్పణలో పి. కిరణ్ (జెమిని కిరణ్) నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతోనే రషా తెలుగుకు పరిచయం కానుంది.
ఇప్పటికే శ్రీనివాస మంగాపురం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగుదనం ఉట్టిపడుతోన్న సినిమాలో అచ్చ తెలుగు అందంగా రషా కనిపించింది కానీ, కొంతమంది ఆమె మంగా పాత్రకు సెట్ కాలేదని పెదవి విరిచారు. ఆ పాత్రకు ఎవరు దొరకన్నట్లు ఈ ముంబై భామను అజయ్ భూపతి ఎలా తీసుకున్నాడు అంటూ మండిపడ్డారు కూడా. అయితే అమ్మడు ఏమి అంత ఈజీగా ఈ సినిమా ఒప్పుకోలేదు. మేకర్స్.. రషా కోసం కోట్లు ఖర్చుపెట్టినట్లు ఒక వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. మంగ పాత్ర కోసం రషా ఏకంగా రూ. 1 కోటి భారీ పారితోషికాన్ని అందుకున్నట్లు సమాచారం. ఒక డెబ్యూ హీరోయిన్‌కు ఈ స్థాయి రెమ్యునరేషన్ ఇవ్వడం నిజంగా అరుదైన విషయమనే చెప్పాలి.
సరే హీరోయినే కోటి తీసుకుంటే.. హీరో జయకృష్ణ ఇంకెన్ని కోట్లు తీసుకొని ఉంటాడో అని అనుకుంటే పొరపాటే. జయకృష్ణ ఈ సినిమాకు ఎలాంటి పారితోషికం తీసుకోలేదని సమాచారం. ఇంతటి ప్రతిష్టాత్మక బ్యానర్లో, అగ్ర నిర్మాత సమర్పణలో ల్యాంచ్ అవ్వడమే గొప్ప అవకాశంగా భావించి ఈ కుర్రాడు ఉచితంగానే నటించినట్లు తెలుస్తోంది. దీంతో రషా భారీ పారితోషికంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన టాలీవుడ్ మేకర్స్ స్థానిక టాలెంట్‌ను పక్కనపెట్టి, ముంబై నుండి వచ్చే కొత్త ముఖాలకు ఇంత భారీ మొత్తాలు ఎందుకు ఆఫర్ చేస్తున్నారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. రషా రవీనా టాండన్ కుమార్తె కావడంతో, ఆమెకున్న క్రేజ్, స్టార్ కిడ్ ఇమేజ్ మార్కెట్ అప్పీల్‌ను దృష్టిలో ఉంచుకునే మేకర్స్ ఈ రేంజ్ పారితోషికాన్ని ఇచ్చి ఉంటారని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఇంకొందరు మాత్రం స్టార్ హీరోయిన్ కూతురు అయినా కూడా అంతా సీన్ ఉండదు అని పెదవి విరుస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ సినిమా జులై 30 న రిలీజ్ అవుతున్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్ అధికారికంగా రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు. మరి కోటి తీసుకొన్న ఈ బ్యూటీ తెలుగులో మొదటి సినిమాతోనే హిట్ అందుకుంటుందా లేదా అనేది చూడాలి.
క్రేజీ అప్డేట్.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో సూర్య.. ‘జై భీమ్’ కాంబో రిపీట్!
‘హ్యాపీ జర్నీ’ టీజర్.. మగాళ్లకు తెలియాల్సిన మహిళల భావోద్వేగాలు!
పాతికేళ్ల తర్వాత... ఈ జన్మలోనే నాకు నచ్చిన పాత్ర చేశా- అన్నపూర్ణమ్మ