
దేశం గర్వించే రాజధాని అమరావతి నిర్మాణంలో భాగమైనందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలని, ఇది కేవలం కట్టడాల నిర్మాణం కాదని, ఓ చరిత్ర నిర్మాణమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్న కాంట్రాక్టు సంస్థలు, తాము ఒక బ్రాండ్‌ను సంపాదిస్తున్నామన్న భావనతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోంజి, మెగా ఇంజినీరింగ్, ఎన్సీసీ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సోమవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, "హైదరాబాద్ ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నాం. ఇది యావత్ దేశానికి గర్వకారణంగా నిలవాలి. అత్యుత్తమ నివాసయోగ్య నగరంగా రూపుదిద్దుకుంటున్న అమరావతిలో మేం భాగస్వాములం అయ్యామన్న ఆలోచనతో కాంట్రాక్టర్లు పనిచేయాలి" అని సూచించారు. నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, నిర్దేశిత గడువు కంటే ముందే పూర్తి చేయాలని ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ టవర్లు రాష్ట్రానికి ఐకానిక్ నిర్మాణాలుగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు.ప్రస్తుతం రాజధాని పరిధిలో రూ.50,999 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. హౌసింగ్, ట్రంక్ ఇన్ఫ్రా, ఎల్పీఎస్ ఇన్ఫ్రాతో పాటు కీలకమైన ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగంగా జరుగుతోందని తెలిపారు. పనుల వేగవంతానికి అవసరమైన యంత్రాలు, మానవ వనరులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం 26,924 మంది కార్మికులు, 5,140కి పైగా భారీ యంత్రాలు పనుల్లో నిమగ్నమై ఉన్నాయని పురపాలక శాఖ మంత్రి