
128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనానికి మార్గం సుగమమైంది. 2028లో జరగనున్న లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీల కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అర్హత...
128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనానికి మార్గం సుగమమైంది. 2028లో జరగనున్న లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ పోటీల కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అర్హత ప్రక్రియను అధికారికంగా ఆమోదించింది. పురుషుల, మహిళల విభాగాల్లో టీ20 ఫార్మాట్లో ఈ పోటీలు జరగనుండగా, ఒక్కో విభాగంలో 6 జట్లు పాల్గొంటాయి.పురుషుల విభాగానికి వచ్చేసరికి, ఐసీసీ టీ20 ర్యాంకుల ఆధారంగా నాలుగు జట్లు నేరుగా అర్హత సాధిస్తాయి. అయితే, టాప్-4 జట్లకు కాకుండా నాలుగు వేర్వేరు ఖండాల నుంచి టాప్ ర్యాంకుల్లో ఉన్న జట్లకు ఈ అవకాశం దక్కుతుంది. 2026 డిసెంబర్ 31 నాటికి ఉన్న ర్యాంకులను దీనికి ప్రామాణికంగా తీసుకుంటారు. ఆతిథ్య దేశం అమెరికాకు ఒక బెర్త్ ఖరారైంది. అయితే, అర్హత వ్యవధిలోపు ఆ జట్టు ఐసీసీ టాప్-15 ర్యాంకుల్లో ఒక్కసారైనా చోటు దక్కించుకోవాల్సి ఉంటుంది. మిగిలిన ఒక స్థానం కోసం 'ఫైనల్ ఒలింపిక్ గ్లోబల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్' నిర్వహిస్తారు.మహిళల విభాగంలో మాత్రం ఈ ప్రక్రియ భిన్నంగా ఉంది. ర్యాంకులకు బదులుగా 2026లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ప్రదర్శన ఆధారంగా నాలుగు జట్లు నేరుగా క్వాలిఫై అవుతాయి. ఈ టోర్నీలో నాలుగు వేర్వేరు ఖండాల నుంచి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన జట్లకు ఒలింపిక్ బెర్త్‌లు లభిస్తాయి. పురుషుల మాదిరిగానే అమెరికాకు ఆతిథ్య కోటాలో చోటు దక్కగా, చివరి స్థానాన్ని గ్లోబల్ క్వాలిఫయర్ ద్వారా భర్తీ చేస్తారు.వెస్టిండీస్ జట్టు ఐసీసీ టోర్నీలలో ఆడుతున్నప్పటికీ, దానికి ఒలింపిక్ గుర్తింపు లేదు. ఒకవేళ ఆ