
తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ (CM Vijay) ఓదార్పు యాత్రకు సిద్దమవుతున్నారు. గతంలో తన ప్రచార సభ సందర్భంగా తొక్కిసలాట జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో సీబీఐ కేసు ఎదుర్కొంటున్న విజయ్..
ఇప్పుడు ఆ బాధితుల్ని పరామర్శించాలని నిర్ణయించారు. ఇందుకోసం జూలైలో ఓదార్పు యాత్రకు ప్లాన్ చేశారు. ఇది ఒక్క రోజు ఉంటుందా లేక కొన్ని రోజుల పాటు సాగుతుందా అనేది త్వరలో ప్రకటిస్తారు. AIADMKకు మరో షాక్..! దుర్బేధ్యంగా మారుతున్న విజయ్ సర్కార్..!గతేడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఉన్న వేలుచమిపురంలో టీవీకే (TVK) ప్రచార కార్యక్రమం సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ సభకు భారీగా జనం తరలిరావడంతో జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. దీనిపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఆ విషాద ఘటన తర్వాత విజయ్.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఈ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. Tamil Nadu: విజయ్ సహా మంత్రుల భవిష్యత్తు తేల్చనున్న మద్రాస్ హైకోర్టు..!అయితే భద్రతా కారణాల దృష్ట్యా, బాధిత కుటుంబాలను చెన్నైకి రప్పించే ఏర్పాట్లు చేసిన అనంతరం, విజయ్ వారిని మామల్లపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో కలుసుకున్నారు. ఆ సమావేశంలో వారికి తన సానుభూతిని తెలియజేయడంతో పాటు, బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఇప్పుడు విజయ్ నేరుగా వారి ఇళ్లకే వెళ్లి పరామర్శించాలని నిర్ణయించారు. జూలై రెండవ వారంలో విజయ్ కరూర్‌ను సందర్శించనున్నారు. ఈ పర్యటనలో మొత్తం 41 మంది బాధితుల కుటుంబాలను కలిసి, వారితో స్వయంగా మాట్లాడాలని విజయ్ భావిస్తున్నారు.