
ప్రపంచాన్ని కుదిపేసిన ఇంధన సంక్షోభ సమయంలో పరిస్థితిని భారత్ సమర్థంగా ఎదుర్కొందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు.
హర్మూజ్ జలసంధిని దాదాపు నాలుగు నెలలు మూసివేసినా దేశంలో ఇంధన సరఫరాపై ఎలాంటి ప్రభావం పడకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. టోల్ చెల్లించకుండానే 12కు పైగా ఎల్పీజీ నౌకలను హర్మూజ్ నుంచి తరలించామని వెల్లడించారు.ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని పురీ పేర్కొన్నారు. ముడిచమురు దిగుమతులను ఒక్క దేశానికే పరిమితం చేయకుండా పలు దేశాల నుంచి తెప్పించామని చెప్పారు. దీంతో దేశంలో వంటగ్యాస్, ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడలేదన్నారు.సంక్షోభ సమయంలో దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని కూడా భారీగా పెంచామని వివరించారు. ఇంతకుముందు వంటగ్యాస్ ఉత్పత్తి చేయని రిఫైనరీలను కొద్ది రోజుల్లోనే మార్పులు చేసి ఎల్పీజీ తయారీకి సిద్ధం చేశామని చెప్పారు. దీంతో రోజుకు 35 వేల మెట్రిక్ టన్నులుగా ఉన్న ఉత్పత్తిని 54 వేల మెట్రిక్ టన్నులకు పెంచగలిగామని తెలిపారు.వంటగ్యాస్ కొరత రాకుండా అల్జీరియా, జపాన్, కెనడా వంటి దేశాలతో కొత్త సరఫరా ఒప్పందాలు కుదుర్చుకున్నామని పురీ చెప్పారు. అమెరికా నుంచి అదనపు ఎల్పీజీ కార్గోలను కూడా తెప్పించామని వెల్లడించారు. దీంతో దేశీయ అవసరాలను పూర్తిగా తీర్చగలిగామని అన్నారు.ఇంధన ధరల భారం తగ్గించేందుకు కేంద్రం లీటరుకు రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని గుర్తుచేశారు. అలాగే బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు వంటగ్యాస్ పంపిణీలో డిజిటల్ అథెంటికేషన్ విధానాన్ని తప్పనిసరి చేశామని చెప్పారు. ఈ చర్యల వల్ల ప్రపంచ ఇంధన సంక్షోభ