
ప్రయాణం చేయాలంటే లక్షల్లో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సరైన ప్రణాళికతో కేవలం రూ.10 వేల బడ్జెట్లోనే భారతదేశంలోని ఎన్నో అందమైన పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. మరి రూ.
10 వేలలోపు వెళ్లొచ్చే బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఏవో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: బడ్జెట్ తక్కువగా ఉందని ప్రయాణాలను వాయిదా వేయాల్సిన అవసరం లేదు. సరైన ప్రణాళికతో కేవలం రూ.10 వేలలోపే భారత్‌లోని ఎన్నో అందమైన పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. చారిత్రక కట్టడాలు, బీచ్‌లు, కొండ ప్రాంతాలు, ప్రకృతి అందాలు ఇలా మీ అభిరుచికి తగ్గ పర్యాటక ప్రాంతాలను తక్కువ ఖర్చుతో సందర్శించవచ్చు.
రాజస్థాన్ రాజధాని జైపూర్ బడ్జెట్ ట్రావెల్‌కు మంచి ఎంపిక. కోటలు, రాజభవనాలు, సంప్రదాయ మార్కెట్లు, స్థానిక వంటకాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
నగరంలో ఆటోలు, బస్సులు లేదా నడక ద్వారా సులభంగా తిరగవచ్చు.
సముద్రతీర వాతావరణం, ప్రశాంతమైన వీధులు, ఫ్రెంచ్ శైలి నిర్మాణాలతో పుదుచ్చేరి ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ముందుగానే బుకింగ్ చేస్తే ఖర్చు తగ్గుతుంది.
సైకిల్ లేదా ద్విచక్ర వాహనం అద్దెకు తీసుకుంటే ప్రయాణ ఖర్చు తగ్గుతుంది.
రాక్ బీచ్, ఫ్రెంచ్ క్వార్టర్, అరవిందో ఆశ్రమం వంటి ప్రాంతాలను తప్పకుండా సందర్శించాలి.
యునెస్కో వారసత్వ ప్రదేశమైన హంపి చారిత్రక కట్టడాలతో ప్రసిద్ధి చెందింది. ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి గమ్యస్థానం.
సైక్లింగ్, కొండలపై సూర్యాస్తమయం వీక్షించడం, తుంగభద్ర నది తీరంలో గడపడం వంటి అనుభవాలు తక్కువ ఖర్చుతో లభిస్తాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి ఎప్పటికీ ట్రావెలర్స్‌కు ఫేవరెట్ డెస్టినేషన్. ఢిల్లీ నుంచి రాత్రి బస్సులో వెళ్తే ప్రయాణ ఖర్చు తగ్గుతుంది. హాస్టల్స్, హోమ్‌స్టేలు బడ్జెట్‌కు అనుకూలంగా ఉంటాయి.
స్థానిక ధాబాల్లో భోజనం చేస్తే ఖర్చు తక్కువ
ఓల్డ్ మనాలి, హిడింబా ఆలయం, బియాస్ నది తీర ప్రాంతం, సోలాంగ్ వ్యాలీ వంటి ప్రదేశాలను తక్కువ ఖర్చుతోనే సందర్శించవచ్చు.
పచ్చని అడవులు, జలపాతాలు, గుహలు, మేఘాల నడుమ ఉండే చిరపుంజి ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. మూడు రోజుల ట్రిప్‌కు సుమారు రూ.7,000–9,000 సరిపోతుంది.
స్థానిక బస్సులు, షేర్డ్ టాక్సీలతో ప్రయాణిస్తే ఖర్చు తగ్గుతుంది.
ప్రయాణ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలి.
హోటళ్లకు బదులుగా హాస్టల్స్ లేదా హోమ్‌స్టేలను ఎంచుకోవాలి.
వీలైనంత వరకు వాకింగ్ లేదా సైక్లింగ్ చేయాలి.
సరైన ప్రణాళికతో ప్రయాణిస్తే రూ.10 వేల బడ్జెట్లోనే ఈ అందమైన ప్రదేశాలను సందర్శిస్తూ మరపురాని అనుభవాన్ని సొంతం చేసుకోవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
గోడకు మేకు కొట్టే ముందు ఈ వాస్తు నియమాలు తప్పక తెలుసుకోండి
టాబ్లెట్‌పై గీత ఎందుకు ఉంటుంది? దాని ఉపయోగం మీకు తెలుసా?