
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా లోని పార్టీ శ్రేణులు పోరాడాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) పిలుపునిచ్చారు.
బీజేపీ కార్యాలయాలను నితిన్ నబీన్ వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాపోరాటలు చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ (Prime Minister Modi) కృషి చేస్తున్నారన్నారు. ప్రజాసేవ, పోరాటల ద్వారానే రాష్ట్రంలో అధికారంలోకి రాగలం. పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని ప్రతి కార్యకర్త సంకల్పం తీసుకోవాలి. పశ్చిమ బెంగాల్ (West Bengal)లో కార్యకర్తల కృషితోనే బీజేపీ విజయం సాధించింది. అదే స్ఫూర్తితో తెలంగాణ (Telangana)లోనూ పోరాడాలి. త్వరలో ఈ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. లోక్సభ ( Lok Sabha)లో రెండు సీట్లతో ప్రారంభమైన బీజేపీ, ఇప్పుడు అప్రతిహతంగా సాగుతోంది. తెలంగాణ కోసం సూష్మాస్వరాజ్ ఎంతో పారాడారు. ఆనాడు ప్రతిక్షంలో ఉన్న బీజేపీ వల్లే తెలంగాణ కల సాకారమైంది అని అన్నారు.