
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Bank Holiday July 2026: ఎల్లుండి నుంచి కొత్త నెల జూలై ప్రారంభం కాబోతుంది. అయితే ఎప్పటిలాగే ఒకటో తారీఖు వస్తే అనేక మార్పులు వస్తుంటాయి. ఈ క్రమంలో మనకు ప్రతినెలా తప్పక అవసరం ఉండే బ్యాంకుల సమాచారం తెలుసుకోవడమూ ముఖ్యమే. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే జూలై నెలలో ఎన్ని రోజులు బ్యాంకులు మూతపడనున్నాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమాచారం ముందే తెలుసుకోవడం వల్ల సకాలంలో మన బ్యాంకు పనులను పూర్తి చేయగలుగుతాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితా ప్రకారం.. జూలైలో మొత్తం 12 బ్యాంకులకు సెలవులు రానున్నాయి. వివిధ నగరాలు, రాష్ట్రాలలో సెలవులు ఎప్పుడు ఉన్నాయో మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. బ్యాంకులు 12 రోజుల పాటు ఎందుకు మూసివేయబడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జూలైలో బ్యాంకులు ఎప్పుడు మూతపడతాయి? జూలై నెలలో 5, 12, 19, 26వ తేదీల్లో ఆదివారాలు కావడం వల్ల ఆ నాలుగు రోజులు తప్పనిసరిగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సెలవు దినంగా పరిగణిస్తారు. అయితే ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన ప్రాంతీయ పండుగలు, ఇతర ఉత్సవాల వల్ల బ్యాంకులకు సెలవులు రానున్నాయి. జూలై 6వ తేదీ MHIP దినోత్సవం కారణంగా మిజోరాంలోని ఐజ్వాల్ సెలవు రానుంది. జూలై 9వ తేదీ బెహ్దియెన్ఖ్లామ్ సందర్భంగా షిల్లాంగ్‌లో సెలవు రానుంది. జూలై 11 తేదీన రెండో శనివారం.. అలాగే జూలై 25న నాలుగో శనివారం కావడం వల్ల దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉండనుంది.
ఆ తర్వాత ఒడిశాలో ఘనంగా నిర్వహించే జగన్నాథ రథయాత్ర సందర్భంగా జూలై 16న ఆ రాష్ట్రంలో సెలవుగా ప్రకటించగా.. అదే రోజున కాంగ్, హరేలా ఉత్సవాల కారణంగా డెహ్రాడూన్, మణిపూర్ ప్రాంతాల్లో సెలవు ఉండనుంది. జూలై 17వ తేదీన తీరోత్ సింగ్ వర్ధంతి కారణంగా మేఘాలయలోని షిల్లాంగ్, జూలై 18వ తేదీ ద్రుక్పా త్షే జీ ఉత్సవం కారణంగా సిక్కింలోని గాంగ్టక్.. అలాగే జూలై 22న ఖర్చీ పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులు మూతపడనున్నాయి.
అయితే మీ నగరంలో బ్యాంకులు మూసివేసినా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బ్యాంకు శాఖలు మూసివేసినప్పటికీ, డిజిటల్ బ్యాంకింగ్ యథావిధిగా పనిచేస్తూనే ఉంటుంది. మీరు UPI, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేయవచ్చు.
నగదు జమ చేయాల్సి వస్తే ఏమి చేయాలి? బ్యాంకు మూసి ఉన్నప్పుడు మీరు మీ ఖాతాలో నగదు జమ చేయవలసి వస్తే, మీకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వవు. అటువంటి పరిస్థితిలో, మీరు బ్యాంకు బయట ఉన్న నగదు డిపాజిట్ మెషీన్‌ను ఉపయోగించవచ్చు. దీని ద్వారా మీ ఖాతాలోకి నగదును సులభంగా బదిలీ చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.