
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Himayat Sagar Osman Sagar Gates Open: హైదరాబాద్ జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు ఎగువన కురుస్తోన్న వర్షాలకు నిండు కుండలా మారుతుంది. గతంలో చివరి నిమిషం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం.. ఒకేసారి గేట్లు తెవరవడంతో హైదరాబాద్ ఎంజీబీఎస్ మునగిపోయిన సంగతి తెలిసింది. దీంతో ఈ సారి అధికారులు ముందుగానే అప్రమత్తమై ఎగువన కురుస్తోన్న వర్షాలకు అనుగుణంగా గేట్లును ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.
ఈ నేపథ్యంలో మొదటగా 1000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ప్రవాహాన్ని బట్టి గేట్ల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. గేట్ల ఎత్తడంతో హైదరాబాద్ జలమండలి,రెవెన్యూ యంత్రంగం హై అలర్ట్ ప్రకటించింది. మూసి పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమతంగా ఉండాలని సూచించింది. ఇక మరోవైపు తెలంగాణలో కూడా రెండు రోజులు భారీ వర్ష సూచన ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీ ఇన్‌ఫ్లో వస్తుండడంతో హిమాయత్ సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. పై నుంచి వస్తున్న వరదకు అనుకూలంగా రిజర్వాయర్ క్రస్ట్ గేట్లను ఎత్తారు అధికారులు. మొదటగా 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ప్రవాహాన్నిబట్టి గేట్ల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. గేట్లు ఎత్తడంతో హైదరాబాద్ జలమండలితో పాటు రెవెన్యూ యంత్రాంగం హై అలెర్ట్ ప్రకటించింది. మూసి పరివాహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు తెలంగాణలో కూడా రెండు రోజులు భారీ వర్ష సూచన ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తంగా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు తెరవడంతో దిగువ ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ముందే జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈరోజు రేపు కూడా రాష్ట్రంలో భారి వర్షాలు కురిసే అవకాశం ఉన్నటు వంటి నేపథ్యంలో నిత్యం అధికారులు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. జంట జలాశయాలకు సంబంధించిన ఇన్‌ఫ్లోలకు సంబంధించి నిమిష నిమిషానికి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అధికారులు. ఎగువ నుంచి వచ్చేటటువంటి వరద తీవ్రతను బట్టి అవసరమైతే మరికొన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.