
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను.
2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Mumbai Hotel Raid Actress Rescued: ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలో నడుస్తున్న ఒక హై-ప్రొఫైల్ వ్యభిచార ముఠాను ముంబై పోలీసులు ఛేదించారు. ఈ చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్న హోటల్‌పై పోలీసులు దాడి చేసి ముగ్గురు హీరోయిన్లను రక్షించారు. ఈ ఘటన వినోద పరిశ్రమలో పెద్ద కలకలం రేపుతూ, తీవ్ర చర్చకు దారితీసింది.
దక్షిణ ముంబైలోని గిర్గావ్ ప్రాంతంలో ఒక హై-ప్రొఫైల్ వ్యభిచార ముఠాను ముంబై పోలీసులు గుట్టు రట్టు చేశారు. అక్రమ కార్యకలాపాలు జరుగుతున్న హోటల్‌పై పోలీసులు దాడి చేసి ముగ్గురు హీరోయిన్లను రక్షించగా.. వీరిలో ఒక మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి కాగా.. మరొకరు బెంగాలీ సినీ ఇండస్ట్రీకి చెందిన వారిగా గుర్తించారు. అలాగే మూడో వ్యక్తి బాలీవుడ్ చిత్రాల్లో అతిథి పాత్రలు పోషించే నటిగా పోలీసులు గుర్తించారు. ఇప్పుడీ వార్త చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ముంబైలోని గిర్గావ్లో ఒక హోటల్లో ఉన్నత స్థాయి వ్యభిచార ముఠా పనిచేస్తోందని పోలీసులకు నిఘా సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు సదరు హౌటల్‌పై దాడి చేశారు. ఈ సీక్రెట్ ఆపరేషన్‌లో ఇద్దరు హీరోయిన్లను మొదటగా గుర్తించగా.. ఆ తర్వాత మరో హీరోయిన్ ఉందని గుర్తించారు. ఆ తర్వాత దాడిలో పట్టుబడ్డ మహిళలను, ఇతర వ్యక్తులను ఇప్పుడు ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరైనా ప్రమేయం ఉన్నారా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
జనవరిలో ఓసారి దొరికారు.. ఈ ఏడాది జనవరిలో నవీ ముంబైలోని తుర్బే నాకా ప్రాంతంలో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU) ఒక భారీ ఆపరేషన్ నిర్వహించింది. తుర్బే నాకాలోని ఒక లాడ్జ్‌లో నడుస్తున్న వ్యభిచార ముఠాపై దాడి చేసి ఏడుగురు మహిళలను రక్షించారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ నిర్వహించారు. సమాచారాన్ని ధృవీకరించుకోవడానికి, పోలీసులు ఒక నకిలీ కస్టమర్‌ను లాడ్జ్‌కు పంపారు. అక్కడ వ్యభిచారం జరుగుతోందని నిర్ధారించుకున్న తర్వాత, బృందం వెంటనే దాడి చేసింది. ఈ దాడిలో, ఏడుగురు మహిళలను వ్యభిచారం కోసం లాడ్జ్‌లోని వేర్వేరు గదుల్లో ఉంచినట్లు కనుగొన్నారు. గిర్గావ్లో జరిగిన ఈ ఆపరేషన్ అనంతరం ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి హై-ప్రొఫైల్ వ్యభిచార ముఠాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.