దుబ్బాకలో ఓ ఇంట్లో దొంగలు పడి నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లారు. పట్టణానికి చెందిన చింత రాజ్‌కుమార్ కుటుంబసభ్యులతో కాశీయాత్రలకు వెళ్లారు.
వీరి ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు కిటికీ ఊచలు విరగగొట్టి లోనికి ప్రవేశించారు. పడకగదిలో లాకర్ పగలగొట్టి కేజీ బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం పనిమనిషి గమనించి యజమానికి సమాచారం అందించింది. ఎస్సై కీర్తిరాజు సిబ్బంది, క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్ తో వచ్చి ఆధారాలు సేకరించారు. దుబ్బాకలో భారీ చోరీ |