
ఇంటర్నెట్ డెస్క్: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడంతో భారత మేనేజ్మెంట్పై ప్రశ్నల వర్షం కురుస్తోంది.
ఇక ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను (India vs Ireland T20 Series) ఓడిపోవడంపైనా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టీమ్ఇండియా అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డస్కెటే వీటిపై వివరణ ఇచ్చాడు. ఇతర ప్లేయర్ల మాదిరిగానే అరంగేట్రం ప్రక్రియ వైభవ్కూ ఒకేలా ఉంటుందని తెలిపాడు.
‘‘ఇప్పటికీ మేం సిరీస్ ఓటమిని (Indis vs Ireland) నమ్మలేకపోతున్నాం. వరల్డ్ కప్‌ను గెలిచిన జట్టుకు ఇలాంటి క్లిష్టపరిస్థితులు వస్తాయని ఎవరూ ఊహించి ఉండరు. బేసిక్స్‌ను బాగా పాటించిన జట్టు చేతిలో పరాజయం చవిచూశాం. ఇంకాస్త స్మార్ట్‌గా క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉందని గ్రహించాం. ఇక రెండోది.. భిన్నమైన పరిస్థితులకు అలవాటు పడటం త్వరగా నేర్చుకోవాలి. ఈ విషయంలో మేం వెనుకబడిపోయామని చెప్పగలను. అదే మా ఓటమికి ప్రధాన కారణమైంది. ఇంతకుముందు వరకూ స్వేచ్ఛగా సిక్స్‌లు కొట్టడానికి, దూకుడుగా ఆడేందుకు బాగా అలవాటు పడిపోయాం. ఐర్లాండ్‌లో పరిస్థితులు భిన్నం. ఆ సమస్యను సరిగ్గా గుర్తించలేకపోయాం. ఇక ఇంగ్లాండ్‌లోనూ (India vs England) ఇదే పరిస్థితి ఉండొచ్చు. అయితే, పిచ్‌లు ఇప్పటి కంటే ఇంకాస్త వేగంగా ఉండే అవకాశం లేకపోలేదు. అక్కడ గెలవాలంటే మేం మా ఆటతీరు విషయంలోనే కాకుండా.. పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిందే’’ అని టెన్ వెల్లడించాడు.
‘‘వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధమే. అందులో ఎలాంటి సందేహం లేదు. అదే సమయంలో సంజు శాంసన్ వంటి ప్రపంచ కప్ హీరో కూడా జట్టుతోపాటు ఉన్నాడు. ఐపీఎల్లో ఇద్దరూ మంచి ఆటతీరు ప్రదర్శించారు. ఆటగాళ్లకు భరోసా ఇవ్వడంతోపాటు జట్టులో వారికి తగినంత సమయం కల్పిస్తామనే సందేశాన్ని అందించడం చాలా ముఖ్యం. మేం కూడా వైభవ్ ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఇతర అరంగేట్రం ఆటగాళ్లకు ఎలాంటి ప్రాసెస్ ఉంటుందో.. వైభవ్ విషయంలోనూ అదే వర్తిస్తుంది. అతడి ఆటతీరుపై మాకెలాంటి సందేహాలు లేవు’’ అని టెన్ డస్కెటే వివరించాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.