
జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యింది రష్మి గౌతమ్. దాదాపు 13ఏళ్లుగా ఆమె ఈ షోకి యాంకర్‌గా చేస్తూ ఆకట్టుకుంటోంది. తనదైన కామెడీతో, ఎంటర్టైన్మెంట్తో అలరిస్తోంది.
సుమ తర్వాత ఒక షోని ఇంత లాంగ్ రన్లో హోస్ట్ చేస్తున్న యాంకర్‌గా రష్మి రికార్డు సృష్టించిందని చెప్పొచ్చు. ఇప్పటికీ ఆమె జబర్దస్త్ కామెడీ షోతోపాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్‌గా చేస్తుంది. దీంతోపాటు కొత్తగా ఆమె `ఆహా` కోసం టాప్ తెలుగు ఇన్ఫ్లూయెన్సర్ షో చేస్తుంది. ఇటీవలే దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ ఈవెంట్ జరిగింది.
ఈ క్రమంలో రష్మి గౌతమ్ తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన బ్యాక్‌గ్రౌండ్ గురించి వెల్లడించింది. తన అమ్మ మమతా గౌతమ్ ది ఒరిస్సా అట. అలాగే తన నాన్న రామ్ గౌతమ్ ది ఉత్తర ప్రదేశ్ అట. తాను విశాఖపట్నంలో పుట్టి పెరిగినట్టు తెలిపింది. అయితే తమ ఫ్యామిలీ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అట. వాళ్లు చాలా కూల్‌గా, అఫీషియల్‌గా, డిగ్నిటీగా ఉంటారని తెలిపింది రష్మి. తాను మాత్రమే ఈ రంగంలోకి వచ్చినట్టు చెప్పింది. తన అమ్మా నాన్నలకుగానీ, తాతలు, అన్నలు, అమ్మమ్మలకుగానీ ఈ సినిమా రంగంతో సంబంధం లేదని తెలిపింది రష్మి. తాను దారి తప్పి సినిమా రంగంలోకి వచ్చానని, దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతూ వస్తున్నట్టు చెప్పింది. ఈ జబర్దస్త్ యాంకర్ నాన్న తన చిన్నప్పుడే మరణించాడట. దీంతో తల్లినే తనని పెంచిందట.
తాను మొదట `యువ` అనే సీరియల్లో నటించినట్టు చెప్పింది. ప్రారంభంలో సీరియల్స్ చేశానని, కానీ పెద్దగా గుర్తింపు రాలేదని, ఆ తర్వాత కొంత కాలం బ్రేక్ తీసుకున్నట్టు తెలిపింది. అనంతరం మళ్లీ ప్రయత్నాలు చేయగా, సినిమా అవకాశాలు వచ్చాయని, ఈ క్రమంలోనే జబర్దస్త్ కి యాంకర్‌గా చేసే ఛాన్స్ ని సొంతం చేసుకున్నట్టు వెల్లడించింది రష్మి గౌతమ్.
సినిమాల గురించి రష్మి చెబుతూ, ఇప్పుడు సరైన ఆఫర్లు రావడం లేదని, ఐటెమ్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ కోసం అడుగుతున్నారని, అందుకే తాను చేయడం లేదని వెల్లడించింది. మంచి పాత్రలు వస్తే చేయడానికి తాను సిద్ధమే అని, మంచి అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పింది. ఇప్పుడు ఆహాలో చేయబోతున్న సరికొత్త షో ఇన్‌ఫ్లూయెన్సర్లని వెలికితేసే షో అని, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుందని తెలిపింది రష్మి గౌతమ్.