చర్మంపై ముడతలు తగ్గించి మిమ్మల్ని యవ్వనంగా ఉంచేందుకు ఈ చిట్కా పనిచేస్తుంది. దీనికోసం టొమాటో రసంలో విటమిన్ ఇ క్యాప్సూల్ కలిపి ముఖానికి బాగా రాసుకోండి.
15 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే చర్మం యవ్వనంగా మారుతుందని PMC రీసెర్చ్ పేర్కొంది.
చర్మంపై ఏర్పడిన ట్యాన్ పోయేందుకు ఈ చిట్కా పనిచేస్తుంది. దీనికోసం టొమాటో గుజ్జులో కొద్దిగా పసుపు కలిపి ముఖం, మెడకు రాసుకోండి. పావు గంట తర్వాత క్లీన్ చేసుకుంటే చర్మంపై ట్యాన్ పోతుంది.
చర్మంపై ఏర్పడిన నల్ల మచ్చలు, బ్లా్క్ హెడ్స్ తగ్గించేందుకు ఈ చిట్కా పనిచేస్తుంది. దీనికోసం టొమాటో గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి నల్ల మచ్చలు ఉన్నచోట రాయండి. 10 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
ముఖంపై ఏర్పడిన రంధ్రాలను తొలగించడానికి ఈ చిట్కా పనిచేస్తుంది. దీనికోసం టొమాటోలో కొద్దిగా పాలు కలిపి చర్మానికి మర్దన చేయండి. తర్వాత క్లీన్ చేసుకుంటే చర్మంపై రంధ్రాలు తొలగిపోతాయి.
చర్మంపై మొటిమలు, యాక్నె తగ్గించడానికి ఈ చిట్కా పనిచేస్తుంది. దీనికోసం టొమాటో రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోండి. 10 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే మొటిమలు తగ్గుతాయి. చర్మం హైడ్రేట్‌గా ఉంటుంది.
సన్ బర్న్, ఎర్ర మచ్చలు తగ్గించి చర్మాన్ని కూల్‌గా ఉంచడంలో ఈ చిట్కా పనిచేస్తుంది. దీనికోసం టొమాటో రసంలో కొద్దిగా అలోవెరా కలిపి ముఖానికి రాసుకోండి. పావు గంట తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు తొలగించేందుకు ఈ చిట్కా వాడొచ్చు. దీనికోసం టొమాటో గుజ్జులో కొద్దిగా చక్కెర కలిపి దీనిని ముఖానికి రాసి స్క్రబ్ చేయండి. 5 నిమిషాలు ఉంచి క్లీన్ చేసుకుంటే చర్మ మృతకణాలు తొలగిపోతాయి. స్కిన్ గ్లో పెరుగుతుంది.
చర్మంపై ఏర్పడిన జిడ్డును తొలగించేందుకు ఈ పద్ధతి ఫాలో కావొచ్చు. దీనికోసం టొమాటో నుంచి రసం తీసి అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలపండి. దీనిని కాటన్ ప్యాడ్ సహాయతో ఫేస్ వాష్ చేసుకున్నాక ముఖానికి రాసుకోండి. దీంతో చర్మం పీహెచ్ లెవెల్స్ బాగుంటాయి. చర్మం జిడ్డు తగ్గుతుంది.
చర్మాన్ని నిమిషాల్లో మెరిపించేందుకు ఈ చిట్కా వాడొచ్చు. దీనికోసం టొమాటో గుజ్జులో కొద్దిగా పెరుగు, శనగ పిండి కలిపి ముఖానికి బాగా రాసుకోండి. 15 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే స్కిన్ గ్లో రెట్టింపు అవుతుంది.