పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి చొరబాట్లు కొనసాగుతున్నాయి. రెండు రోజుల్లో వరుసగా రెండోసారి నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడ్డారు.
జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ వద్ద ఉన్న ఎల్ఓసీ దాటి భారత్‌లోకి చొరబడ్డ ఓ పాకిస్థాన్ పౌరుడిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టయిన వ్యక్తిని 31 సంవత్సరాల రయీస్ ఖాన్‌గా అధికారులు గుర్తించారు.పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని హవేలీ జిల్లాకు చెందిన రయీస్ ఖాన్ బాలాకోట్ సెక్టార్లో ఆదివారం ఎల్ఓసీ దాటి భారత భూభాగంలోకి ప్రవేశించాడు. అదే సమయంలో అప్రమత్తంగా ఉన్న సైనికులు అతన్ని అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న తర్వాత అతడి వద్ద ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు.Read Also అదుపులో ఉన్న అతడిని భద్రతా బలగాలు, నిఘా సంస్థలు సంయుక్తంగా విచారిస్తున్నాయి. అతను అనుకోకుండా సరిహద్దు దాటాడా? లేక ఉద్దేశపూర్వకంగానే చొరబడ్డాడా? అన్న కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పీఓకేలో అల్లర్లు, పాకిస్థాన్-అప్ఘన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నిఘా వర్గం కూడా అప్రమత్తమయింది.Read Also శుక్రవారం పీఓకేలో నివసించే 26 ఏళ్ల మహమ్మద్ సజాద్ అనే వ్యక్తి పూంచ్ జిల్లాలోని కృష్ణ ఘాటి సెక్టార్లో గుల్పూర్ ప్రాంతం వద్ద ఎల్ఓసీ దాటి భారత్‌లోకి వస్తున్న సమయంలో సైనికులు పట్టుకున్నారు. అతడిని విచారణ కోసం పోలీసులు నిఘా వర్గాలకు అప్పగించారు. అంతకు ముందు జూన్ 9న జావిద్ అలీ అనే 14 ఏళ్ల బాలుడిని కూడా భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారం రోజుల విచారణ తర్వాత అతడిని పాకిస్థాన్ అధికారులకు అప్పగించారు.బాలాకోట్, గుల్పూర్ ప్రాంతాల్లో వరుసగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు చెందిన వ్యక్తులు ఎల్వోసీ దాటి భారత్‌లోకి రావడంతో భద్రతా సంస్థ అధికారులు అలెర్ట్ అయ్యారు. ఐఎస్ఏ ఏజెంట్లు కావాలనే చొరబడుతున్నారా? లేక ఎల్ఓసీ భద్రతా వ్యవస్థను పరీక్షించే ప్రయత్నాలు చేస్తున్నారా? అన్న కోణాల్లో అధికారులు దర్యప్తు కొనసాగిస్తున్నారు. వరుస ఘటనలతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.