తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హోమ్లీ బ్యూటీ అంజలి .. తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
హైదరాబాద్ వేదికగా జరిగిన ‘మగుడం’ మూవీ సెకండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో అంజలి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకకు సంప్రదాయ చీరకట్టు లుక్‌లో ఆమె హాజరైన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ను ఊపేస్తున్నాయి.* ఓటీటీలో ‘బ్లాస్ట్’ అవుతున్న ప్రీతి ముకుందన్ క్రేజ్.. నీల యాక్షన్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్కు నెటిజన్లు ఫిదా! సాధారణంగా ట్రెండీ వేర్స్‌లో మెరిసే భామలు సైతం అంజలి చీరకట్టు అందాల ముందు తేలిపోతున్నారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన స్టన్నింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు, అభిమానులు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "వయసు పెరుగుతున్న కొద్దీ అంజలి గ్లామర్, అందం మరింత రెట్టింపు అవుతోంది.. వింటేజ్ బ్యూటీ అంటే ఇదే" అంటూ నెట్టింట నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. తన సహజసిద్ధమైన నవ్వుతో, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో అంజలి మరోసారి కుర్రకారు గుండెల్లో మంటలు రేపిందని చెప్పవచ్చు.దర్శకుడిగా విశాల్ డ్రీమ్ ప్రాజెక్ట్!యాక్షన్ హీరోగా, ప్రొడ్యూసర్‌గా కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఉన్న స్టార్ హీరో విశాల్ తన 35వ ప్రాజెక్ట్ ‘మగుడం’ (Magudam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే, ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఉంది. దాదాపు మూడు దశాబ్దాలుగా వెండితెరపై కథను నడిపించాలనే తన కలని నిజం చేసుకుంటూ, ఈ చిత్రం ద్వారా విశాల్ మొదటిసారి మెగాఫోన్ పట్టి దర్శకుడిగా అవతారమెత్తారు. ఒక రా అండ్ రగ్డ్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశాల్ మూడు విభిన్న అవతారాల్లో కనిపించి మెప్పించనున్నారు. ఈ ఈవెంట్లో అంజలి మాట్లాడుతూ చిత్ర విశేషాలను పంచుకున్నారు. "దర్శకుడిగా మారుతున్న నా ప్రియమిత్రుడు విశాల్ ‘మగుడం’ చిత్రంలో నాకు ఒక అత్యంత శక్తివంతమైన, వైవిధ్యమైన అందమైన పాత్రను ఇచ్చారు. మా ఇద్దరి మధ్య గత 15 సంవత్సరాలుగా ఉన్న గాఢమైన స్నేహం ఈ సినిమా ప్రయాణాన్ని మరింత సులభంగా, ప్రత్యేకంగా మార్చింది. ఈ శుభ తరుణంలో మనం సీనియర్ ప్రొడ్యూసర్ ఆర్బీ చౌదరి గారిని మిస్ అవుతున్నప్పటికీ, ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మన యూనిట్‌తోనే ఉంటాయని బలంగా నమ్ముతున్నాను" అని ఉద్వేగంగా పేర్కొంది.* యూట్యూబ్‌లో బెల్లంకొండ ప్రభంజనం.. 100 కోట్ల వ్యూస్‌తో సరికొత్త చరిత్ర సృష్టించిన ‘ఖూన్‌ఖార్’ భారీ యాక్షన్ ఎపిసోడ్స్, స్ట్రాంగ్ మాస్ ఎలిమెంట్స్ మరియు ఎమోషన్స్‌తో విజువల్ వండర్‌గా రూపొందుతున్న ‘మగుడం’ చిత్రంలో దుషారా విజయన్ మరో కథానాయికగా నటిస్తుండగా, స్టార్ కమెడియన్ యోగి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలను అందిస్తున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకుని ఈ చిత్రం వచ్చే జూలై నెలలోనే థియేటర్లలో విడుదల కానుంది. దర్శకుడిగా విశాల్ చేస్తున్న ఈ సరికొత్త సాహసం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్ల వర్షం కురిపిస్తుందో చూడాలి.