
హైదరాబాద్ నగరంలో ఒకవైపు తాగునీటి ఎద్దడి ఇంకా పూర్తిగా తీరకముందే, జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్ గేట్లను అధికారులు అనాలోచితంగా ఎత్తివేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది.
జలాశయం ఇంకా పూర్తిగా నిండకుండానే నీటిని కిందకు వదిలేయడంపై స్థానిక ప్రజలు, నగరవాసులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ముందుగా ప్రకటించినట్లుగానే, జలమండలి అధికారులు స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తారు. జలాశయానికి చెందిన 8వ నంబర్ గేటును ఎమ్మెల్యే చేతుల మీదుగా పైకి లేపి, సుమారు వెయ్యి క్యూసెక్కుల నీటిని మూసి నదిలోకి విడుదల చేశారు. జంట జలాశయాలను నింపి భవిష్యత్తు అవసరాలకు వాడుకోవాల్సిన నీటిని ఇలా నదిలోకి వదిలేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.తాగునీటి ఎద్దడి వేళ.. నీటి వృథా ఎందుకు?హైదరాబాద్‌లో ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. నగరంలోని పలు ప్రాంతాలకు వాటర్ బోర్డ్ అధికారులు ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారానే తాగునీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరకముందే నీటిని వృథాగా కిందకు వదిలేయడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడం మానేసి, కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం నీటిని వదిలేస్తారా? అని స్థానికులు అధికారులను నిలదీస్తున్నారు. Tungabhadra Dam: 73 ఏళ్ల చరిత్రలోనే సువర్ణ ఘట్టం! నేడు చారిత్రాత్మక కలయికఫామ్ హౌస్‌లను కాపాడేందుకేనా?జలాశయం సమీపంలో ఉన్న పలువురు ప్రముఖుల ఫామ్ హౌస్‌లలోకి నీరు చేరకుండా చూసేందుకే అధికారులు ఈ ముందస్తు చర్యలకు పాల్పడ్డారని స్థానికులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. సామాన్య ప్రజల తాగునీటి అవసరాల కంటే కొందరి వ్యక్తిగత ఆస్తుల సంరక్షణకే అధికారులు, పాలకులు పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిండాల్సిన జలాశయాన్ని ఖాళీ చేయడం వెనుక పెద్దల ఒత్తిళ్లు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. అప్పుడే కృష్ణమ్మ పరవళ్లు- ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఓపెన్.. !!రాబోయే వేసవిపై ఆందోళన.. ప్రజల డిమాండ్ ఇదే!జంట జలాశయాలు పూర్తిగా నిండితేనే రాబోయే వేసవిలో హైదరాబాద్‌కు నీటి ఇబ్బందులు ఉండవని, అంతవరకు గేట్లు ఎత్తకూడదని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎవరి ప్రయోజనాల కోసం, ఏ ప్రణాళికతో ఈ నీటిని వదిలేశారో వాటర్ బోర్డ్ అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాలని, వృథాను అరికట్టాలని ప్రజలు గట్టిగా కోరుతున్నారు.