
తమిళనాడులో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే డీఎంకే కూటమిలో ఉన్న ఐదు పార్టీలు స్టాలిన్ కు గుడ్ బై చెప్పేసి విజయ్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు...
తమిళనాడులో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే డీఎంకే కూటమిలో ఉన్న ఐదు పార్టీలు స్టాలిన్ కు గుడ్ బై చెప్పేసి విజయ్ తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాయి. అదే సమయంలో మరో విపక్షం అన్నాడీఎంకే(AIADMK)కు గుడ్ బై చెప్పి విజయ్ కు మద్దతు ప్రకటిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇదే క్రమంలో ఇవాళ కరూర్ ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ అన్నాడీఎంకేకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. Tamil Nadu: విజయ్ సహా మంత్రుల భవిష్యత్తు తేల్చనున్న మద్రాస్ హైకోర్టు..!మాజీ రవాణా శాఖ మంత్రి, అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎం.ఆర్.విజయభాస్కర్ ఇవాళ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీని వీడిన ఆరవ ఎమ్మెల్యేగా ఆయన నిలిచారు. విజయభాస్కర్ ఇవాళ ఉదయం సచివాలయంలో స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇప్పటికే నలుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాజీనామా చేసి అధికార టీవీకేలో చేరడం ద్వారా ప్రతిపక్ష బలాన్ని తగ్గించారు. రెండు వారాల క్రితం అన్నాడీఎంకేను వీడిన మరో ఎమ్మెల్యే సి.విజయభాస్కర్ ఇవాళ సీఎం విజయ్ టీవీకే పార్టీలో చేరతారని భావిస్తున్నారు. స్టాలిన్ ను అసెంబ్లీకి రప్పించబోతున్న విజయ్ ? ఆ ఒక్క డైలాగ్ తో మారిన సీన్..!ఇవాళ రాజీనామా చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎం.ఆర్.విజయభాస్కర్ గతంలో జయలలిత మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2021 ఎన్నికల్లో కరూర్ నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థి వి.సెంథిల్ బాలాజీ చేతిలో ఓడిపోయినప్పటికీ, 2026లో అక్కడి నుంచే తిరిగి ఎన్నికయ్యారు. తాజా రాజీనామాతో తమిళనాడులో ఏడు అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వీటిలో విజయ్ వదులుకున్న తిరుచ్చి ఈస్ట్ స్ధానం కూడా ఉంది. మిగిలిన ఆరుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు. ఆయా స్ధానాలకు త్వరలో ఉపఎన్నికలు జరగాల్సి ఉంది.