
ఇంటర్నెట్ డెస్క్: ముంబయి (Mumbai)ని భారీ వర్షాలు (Heavy rains) ముంచెత్తాయి. ఆదివారం రాత్రి కేవలం నాలుగు గంటల్లోనే 100మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
వర్షం ప్రభావంతో సబర్బన్ రైలు సర్వీసులకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలవడంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వీణా నగర్లో అత్యధికంగా 160.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) వెల్లడించింది.
వర్షం కారణంగా అంధేరి ప్రాంతంలోని సబ్వే (Andheri subway) పూర్తిగా నీట మునిగింది. దీంతో ముందస్తు చర్యగా ఈ అండర్‌పాస్‌లో వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు బీఎంసీ వెల్లడించింది. మరోవైపు వాతావరణం అనుకూలంగా లేనందున విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఇదీ చదవండి: చైనా పర్మిట్ లేక చిక్కుకుపోయి: మానస్ సరోవర్ యాత్ర వేళ కేంద్రం అడ్వైజరీ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.