
భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఇతరులపై ఉన్న క్రిమినల్ కేసును ఉపసంహరించుకోవాలన్న అమెరికా న్యాయశాఖ అభ్యర్థనపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వాలని అక్కడి ఫెడరల్ జడ్జి ఆదేశించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే, ఈ పరిణామం కేసు కొట్టివేతను ఏమాత్రం ప్రభావితం చేయబోదని, ప్రాసిక్యూషన్ విచక్షణాధికారమే అంతిమమని ప్రముఖ అమెరికన్, భారతీయ న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రాసిక్యూషన్ విచక్షణాధికారం అనేది పూర్తిగా కార్యనిర్వాహక వర్గానికి చెందినదని, ఆ అధికారానికి దేశాధ్యక్షుడు అధిపతిగా వ్యవహరిస్తారని కొలంబియా లా స్కూల్ ప్రొఫెసర్ జాన్ సి. కాఫీ తెలిపారు. "న్యాయమూర్తి కేసు ఉపసంహరణకు గల కారణాలను అడగవచ్చు గానీ, ప్రాసిక్యూటర్ నిర్ణయాన్ని తిరస్కరించే అధికారం కోర్టుకు లేదు. ఇది కేవలం న్యాయశాఖ నిర్ణయాన్ని ధ్రువీకరించుకునే ప్రక్రియే" అని ఆయన 'ఐఏఎన్ఎస్'కు వివరించారు.గత నెలలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై ఉన్న సెక్యూరిటీల మోసం, వైర్ ఫ్రాడ్ ఆరోపణలను శాశ్వతంగా ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయశాఖ ప్రకటించింది. ఈ కేసుపై మరింత సమయం, వనరులు వెచ్చించదల్చుకోలేదని తన విచక్షణాధికారం మేరకు నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపింది. అయితే, ఫెడరల్ జడ్జి నికోలస్ గరాఫిస్ ఈ వివరణ సంతృప్తికరంగా లేదని పేర్కొన్నారు. ఫెడరల్ రూల్స్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్లోని రూల్ 48(ఎ) ప్రకారం, కోర్టు తన బాధ్యతలను నిర్వర్తించడానికి తగిన సమాచారం లేదని, అందుకే పూర్తి వివరాలతో కూడిన నివేదికను జులై 13లోగా సమర్పించాలని ఐదు పేజీల ఉత్తర్వులో ఆదేశించారు.ఈ పరిణామంపై అమెరికా మాజీ అటార్నీ బార్బరా మెక్క్వేడ్ స్పందిస్తూ..