
ఇంటర్నెట్ డెస్క్: మొన్నటి వరకూ టీ20 ప్రపంచకప్ ఛాంపియన్‌గా టీమ్ఇండియా అంటే ప్రతి ఒక్కరికీ హడల్. కానీ, ఐర్లాండ్‌తో వరుసగా రెండు టీ20ల్లోనూ ఓడిపోవడంతో ట్రోలర్లకు మళ్లీ ఛాన్స్ ఇచ్చినట్లైంది.
మరీ ముఖ్యంగా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకు ఐసీసీ సభ్యదేశం కూడా కాని ఐస్లాండ్ క్రికెట్ అసోషియేషన్ కూడా తన సోషల్ మీడియాలో గంభీర్‌ను ట్రోల్ చేయడం గమనార్హం. మరోవైపు, భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం గంభీర్ తీరును విమర్శించాడు.
‘‘మేం గౌతమ్ గంభీర్‌ను మా కోచింగ్ స్టాఫ్‌గా తీసుకోవాలని అనుకోవడం లేదు. మాకు ఇష్టం లేదు కూడానూ. అతడిలో అద్భుతమైన ప్రతిభ ఉంది. టీమ్ఇండియా ఆటగాళ్లను తీసుకొచ్చి.. ఐర్లాండ్‌లో ఇలాంటి ఫలితాలను అందించాలంటే అసాధారణమైన ప్రతిభ కావాలి. అది గంభీర్ వద్ద పుష్కలంగా ఉందనిపిస్తోంది’’ అని ఐస్లాండ్ క్రికెట్ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఐర్లాండ్‌తో సిరీస్‌లో ప్రధాన బ్యాటర్లు, బౌలర్ల కంటే ఆల్‌రౌండర్లే ఎక్కువ మంది తుది జట్టులో స్థానం దక్కించుకున్నారు. ఇదే విషయాన్ని సంజయ్ మంజ్రేకర్ ప్రస్తావిస్తూ.. ‘‘గతంలో ఆల్‌రౌండర్ల సంఖ్య తక్కువగా ఉండేది. కానీ, గంభీర్ వచ్చాక వారికి ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. భారత జట్టుకు ప్రధాన మిడిలార్డర్ బ్యాటర్లు అవసరం’’ అని పోస్టు పెట్టాడు. టీ20 జట్టులో శుభ్‌మన్ గిల్‌కు అవకాశం ఇవ్వాలని సూచించాడు.
‘‘శుభ్‌మన్ గిల్ ఐపీఎల్లో అద్భుతంగా ఆడిన టీ20 బ్యాటర్. నేను అతడి సారథ్యం గురించి ప్రస్తావించడం లేదు. కానీ, ఇలాంటి ప్లేయర్లను మాత్రం పొట్టి ఫార్మాట్లోకి మళ్లీ తీసుకురావాలి. ఐర్లాండ్‌లో పిచ్ పరిస్థితులకు తగ్గట్టు ఆడగలిగే సత్తా అతడికి ఉంది. ఇంగ్లాండ్‌లోనూ మెరుగైన ప్రదర్శన చేయగలడు. గతంలోనే అతడు ఎలా ఆడాడో చూశాం’’ అని మంజ్రేకర్ వెల్లడించాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.