
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్, టెక్నాలజీపై అతిగా ఆధారపడి ఎదురైన వైఫల్యాల నుంచి కీలక గుణపాఠం నేర్చుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేటెడ్ క్వాలిటీ సిస్టమ్స్ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో,...
ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్, టెక్నాలజీపై అతిగా ఆధారపడి ఎదురైన వైఫల్యాల నుంచి కీలక గుణపాఠం నేర్చుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేటెడ్ క్వాలిటీ సిస్టమ్స్ ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, కంపెనీ తన పాత వ్యూహానికి స్వస్తి పలికింది. నాణ్యతను పెంచి, ఖర్చులను తగ్గించుకునే లక్ష్యంతో అనుభవజ్ఞులైన ఇంజనీర్లను, ముఖ్యంగా తమ మాజీ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటోంది. మానవ నైపుణ్యానికి మళ్లీ పెద్దపీట వేస్తున్న ఈ నిర్ణయం ఇప్పటికే సత్ఫలితాలనిస్తోందని, జేడీ పవర్ ఇనిషియల్ క్వాలిటీ సర్వేలో ప్రధాన బ్రాండ్లలో ఫోర్డ్ అగ్రస్థానానికి చేరడమే ఇందుకు నిదర్శనమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.'బ్లూమ్‌బర్గ్' కథనం ప్రకారం గత మూడేళ్లలో ఫోర్డ్ సుమారు 350 మంది అనుభవజ్ఞులైన ఇంజనీర్లను తిరిగి నియమించుకుంది. వీరిలో కంపెనీ మాజీ ఉద్యోగులతో పాటు, ఇతర అనుబంధ సంస్థలలో పనిచేసిన నిపుణులు కూడా ఉన్నారు. దశాబ్దాల పాటు వివిధ వాహనాల తయారీలో పనిచేసిన ఉద్యోగుల అనుభవాన్ని విస్మరించి, పూర్తిగా ఆటోమేషన్‌పై ఆధారపడటం పొరపాటని కంపెనీ ఉన్నతాధికారులు అంగీకరించారు.ఈ విషయంపై ఫోర్డ్ వెహికల్ హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ వైస్ ప్రెసిడెంట్ చార్లెస్ పూన్ మాట్లాడుతూ.. "కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ప్రవేశపెడితే సరిపోతుందని, అదే అత్యుత్తమ నాణ్యత గల ఉత్పత్తిని ఇస్తుందని పొరపాటుగా భావించాం. ఏఐ ఒక అద్భుతమైన సాధనమే అయినా, దానికి శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించే సమాచారంపైనే దాని సామర్థ్యం ఆధారపడి ఉంటుంది" అని వివరించారు. అనుభవజ్ఞులైన ఇంజనీర్లు కంపెనీని విడిచి వెళ్లే ముందు వారి విజ్ఞానాన్ని భద్రపరచడంలో విఫలమయ్యామని, దానివల్లే ఏఐ వ్యవస్థలు వాస్తవ ప్రపంచంలోని