
భారత ఈక్విటీ మార్కెట్ సరికొత్త మైలురాయిని అధిగమించి, ప్రపంచ యవనికపై తన సత్తాను మరోసారి చాటింది. దేశీయ మార్కెట్ మొత్తం విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) తొలిసారిగా 5 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది.
దీంతో తైవాన్, దక్షిణ కొరియాలను వెనక్కి నెట్టి, ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా భారత్ తన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది.ఇటీవలి కాలంలో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతుండగా, భారత మార్కెట్లు మాత్రం స్థిరంగా రాణిస్తున్నాయి. జూన్ నెలలో అనేక అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. కానీ, భారత మార్కెట్లు మాత్రం మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. ఈ నెలలో భారత్ మార్కెట్ క్యాప్ 2.75% పెరగ్గా, సమీప పోటీదారులైన దక్షిణ కొరియా 4.7%, తైవాన్ 2.3% మేర నష్టపోయాయి. దీంతో భారత్ ఐదో స్థానానికి చేరేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం భారత్ మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్లు కాగా, తైవాన్ (4.97 ట్రిలియన్ డాలర్లు), దక్షిణ కొరియా (4.66 ట్రిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.గత కొన్ని నెలలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్ స్టాక్స్ కారణంగా రికార్డు స్థాయిలో లాభపడిన తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లలో మదుపరులు ఇప్పుడు లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. దీనివల్ల ఆయా మార్కెట్లలో కరెక్షన్ చోటుచేసుకుంది. ఇదే సమయంలో అమెరికా, చైనా మార్కెట్ క్యాప్‌లలో పెద్దగా మార్పులు కనిపించలేదు.భారత మార్కెట్ల స్థిరత్వానికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు దిగిరావడం, వాల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారడం, విదేశీ