Multibagger Stocks: మనలో చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. అయితే ఇక్కడ చాలానే ఆప్షన్లు ఉంటాయి. స్టాక్ మార్కెట్ , మ్యూచువల్ ఫండ్స్, పోస్టాఫీస్ స్కీమ్స్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆర్బీఐ బాండ్లు,...
Multibagger Stocks: మనలో చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. అయితే ఇక్కడ చాలానే ఆప్షన్లు ఉంటాయి. స్టాక్ మార్కెట్ , మ్యూచువల్ ఫండ్స్, పోస్టాఫీస్ స్కీమ్స్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆర్బీఐ బాండ్లు, గోల్డ్ ఇలా ఎన్నో కనిపిస్తుంటాయి. ఇక్కడ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ వంటివి రిస్క్‌తో కూడుకున్నవి. అయినప్పటికీ ఇక్కడ దీర్ఘకాలంలో కొన్ని స్టాక్స్ అద్భుత స్థాయిలో రిటర్న్స్ ఇస్తుంటాయి. దాన్ని ఎంచుకోవడంలోనే అంతా ఉంటుంది. ఇక్కడ సరైన స్టాక్ ఎంచుకోవాలంటే ఆయా కంపెనీల పనితీరు, ఫలితాలు, ప్రకటనలు, పెట్టుబడి వ్యూహాలు, ప్రణాళికలు అన్నీ జాగ్రత్తగా గమనిస్తూ సరైన సమయంలో సరైన స్టాక్ ఎంచుకొని పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు లాంగ్ రన్లో మంచి లాభాలు అందించిన ఒక స్టాక్ గురించి చూద్దాం.అదే మ్యాగ్నస్ స్టీల్ అండ్ ఇన్ఫ్రా స్టాక్ . ఈ స్టాక్ రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టిన వారికి ఐదేళ్లలో రూ. 41 లక్షలు అందించింది. ఇది గత కొంత కాలంగా దూసుకెళ్తూనే ఉంది. నెల వ్యవధిలో భారీగా తగ్గినప్పటికీ.. 6 నెలల్లో, ఏడాదిలో, ఐదేళ్లలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. గత ఏడాది వ్యవధిలో షేర్ ధర ఏకంగా 820 శాతం వరకు పెరగ్గా రూ. లక్ష పెట్టుబడి పెట్టిన వారికి రూ. 9.20 లక్షలు వచ్చాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 130 శాతం, 6 నెలల్లో 140 శాతం రిటర్న్స్ అందించగా ఒక లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి డబుల్ రిటర్న్స్ కంటే ఎక్కువగానే వచ్చాయి.ఇదే విధంగా 5 సంవత్సరాల వ్యవధిలో చూసినట్లయితే స్టాక్ 4038 శాతం పెరిగింది. ఈ క్రమంలో స్టాక్ ధర చూస్తే రూ. 2 నుంచి రూ. 83.60 స్థాయికి ఎగబాకింది. ఇక్కడ రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టిన వారికి 41 లక్షలు వచ్చాయి. అంటే ఓపికతో ఎదురుచూసిన వారికి కాసుల పంట పండిందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ విలువ చూస్తే ప్రస్తుతం రూ. 28.26 కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 223.40 కాగా, కనిష్ఠ ధర రూ. 9.10 గా ఉంది.గత నెల వ్యవధిలో మాత్రం ఈ స్టాక్ 40 శాతం వరకు తగ్గింది. ఇటీవల పశ్చిమాసియాలో ఉద్రికతల నేపథ్యంలో స్టాక్ ధర పడిపోయిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ గమనార్హం ఏంటంటే.. మే నెలలో ఈ స్టాక్ ధర ఒక దశలో రూ. 212.25 వద్ద ఉండగా అక్కడి నుంచి భారీగా తగ్గింది. ఈ కంపెనీ విషయానికి వస్తే ఐరన్, స్టీల్, ఇతర రా మెటీరియల్స్ వంటివి విక్రయిస్తుంటుంది.Disclaimer: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌కు లోబడి ఉంటాయి. కాబట్టి వీటిల్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలి. పైన ఇచ్చింది సమాచారంగానే పరిగణించాలి. పెట్టుబడికి సిఫార్సు కాదు.