
ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు.. మానవ సంబంధాల గురించి కూడా చాలా గొప్పగా వివరించారు.
కుటుంబంలో కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్యలను కూడా ద్వేషించే పరిస్థితులు మానవులకు ఏర్పడే అవకాశం ఉందని చాణక్యుడు చెప్పాడు. ప్రాణంగా ప్రేమించే కుటుంబాన్ని ద్వేషించి, శత్రువుల్లా భావించే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? ఎలాంటి సందర్భాల్లో మనుషులు అలా ప్రవర్తిస్తారు అనే విషయం ఇప్పుడు చూద్దాం..
భార్యా రూపవతీ శత్రు: పుత్రు: శత్రురపండిత:
దీని అర్థం ఏమిటంటే.. అప్పుల్లో కూరుకుపోయిన తండ్రి , వ్యభిచారిణి అయిన తల్లి, అందమైన భార్య, అవివేకి అయిన కొడుకు శత్రువులు అవుతారట.
చాణక్యుడి ప్రకారం, తండ్రి విపరీతమైన అప్పులు చేస్తే.. ఆ అప్పులు తీర్చాల్సిన భారం పిల్లలపై పడితే, వారి జీవితం మొత్తం ఆర్థిక ఇబ్బందుల్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు తండ్రి.. తమ పిల్లలకు శత్రువుగా మారతాడు. ఆ అప్పు తీరుస్తున్న ప్రతిసారీ తండ్రిని తిట్టుకుంటూనే ఉంటాడు. అందుకే.. ఎవరైనా తమ స్థోమతకు మించి అప్పులు తీసుకోకూడదు. తీసుకున్నా... ఎవరు చేసిన అప్పులు వారే తీర్చేయాలి.
చెడు ప్రవర్తన కలిగిన తల్లి, తన కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా చెడు తిరుగుళ్లు తిరిగితే.. అప్పుడు ఆమె కూడా తన పిల్లలకు శత్రువుగా మారుతుంది. ఆ తల్లి ప్రవర్తన కారణంగా.. పిల్లలను కూడా సమాజంలో చిన్న చూపు చూసి, ఎగతాళి చేస్తారు. ఈ ప్రభావం పిల్లల భవిష్యత్తుపై కూడా పడుతుంది.
చాణక్యుడు కేవలం అందమైన భార్య గురించి మాత్రమే ప్రస్తావించలేదు. కానీ తన కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేసి, కేవలం తన అందంపై మాత్రమే దృష్టి పెట్టే మహిళల గురించి ప్రస్తావించారు. అలాంటి మహిళ భార్యగా వస్తే.. ఆమె కచ్చితంగా భర్తకు శ్రతువుగా మారుతుంది. ఆమె కారణంగా భర్తకు ఇంటి భారం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు తెచ్చి పెడుతుంది.
ఆచార్య చాణక్యుని ప్రకారం, వివేకం లేని పిల్లలు తల్లిదండ్రులకు శత్రువులు అవుతారు. ఎంత గొప్ప చదువులు చదివినా.. మంచి, చెడులకు తేడా తెలియకుండా ప్రవర్తించే పిల్లలు, మంచి విలువలకు దూరమైతే.. అలాంటి పిల్లలు భవిష్యత్తులో కుటుంబానికి ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉన్నాయి. అందుకే.. అలాంటి పిల్లలను తల్లిదండ్రులు శత్రువులుగా పరిగణిస్తారు.