నేను ఇచ్చిన సలహా బాగానే వర్క్ అయి ఉంటుంది..అందుకే ఇలా వచ్చావా?.. మాట్లాడవేంటి అని చక్రిని అడుగుతాడు ఓంకారేశ్వర్. నువ్వు ఇచ్చిన తొక్కలో సలహా వల్ల నా భార్య ఇంట్లోంచి వెళ్లిపోయింది..
నా బతుకు రోడ్డు మీదకు వచ్చింది అని చక్రి అంటాడు. నేను ఇచ్చింది మంచి సలహానే.. కానీ నీకే పని చేయలేదు.. ఇంకో సలహా ఇస్తా తీసుకో.. ఇంజన్ లేనిదే కారు ఉంటుందా అని ఇలాంటి నాలుగు డైలాగ్స్ కొట్టు అని ఓంకారేశ్వర్ అంటాడు. నీ కార్ల బుద్ది పోనిచ్చు కోలేదా? ఓంకారేశ్వర్ అని చక్రి అంటాడు. ఇలాంటి సలహాలు ఇస్తే నన్ను చెప్పుతో కొడుతుంది అని చక్రి అంటాడు. అయితే నీకు క్యాన్సర్ వచ్చిందని, యాక్సిడెంట్ అయిందని ఇలా చెప్పు అని అంటాడు. పీడ పోయిందని అనుకుంటుంది అంటూ చక్రి అంటాడు. నా కాపురం బాగు పడే సలహాలు ఇవ్వు అంటే.. నా కొంప కొల్లేరు చేశావ్.. నా సంసారాన్ని ముక్కలు చేశావ్ అని చక్రి ఫైర్ అవుతాడు. సరే ఇంకో పెగ్గు వేసి ఆలోచిద్దాం రా అని అంటాడు ఓంకారేశ్వర్. ఇంకోసారి పెగ్గులు అంటే నీ లెగ్గులు విరగ్గొడతా.. ఇప్పటికే ఇంట్లో వాళ్లంతా నన్ను వెలేసినట్టుగా చూస్తున్నారు అని చక్రి ఫైర్ అవుతాడు. దీంతో ఓంకారేశ్వర్ సైలెంట్ అయిపోతాడు.పట్టించుకోని కేశవ.. శైలు వచ్చి కేశవ షాప్ ముందు నిల్చుంటుంది. ముంగీస.. ఇకపై నీకు కనిపించను.. నేను హింసించను.. అని అంటుంది. మంచిది అని కేశవ అంటాడు. మా నాన్న చూపించిన వాడ్ని చేసుకుంటాను.. ఇకపై నీకు కనిపించను.. ఇటు రాను అంటుంది. ఆ మాటలో ఒక్క క్షణం ఆగిపోతాడు కేశవ. చివరి సారి అయినా నన్ను చూడవా? అని అంటుంది శైలు. మనం వద్దని అనుకున్న వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని కేశవ అంటాడు. దీంతో శైలు వెళ్లిపోతుంది. చోటు గాడు శైలు వెళ్తోంది అని చెబుతూనే ఉంటాడు. శైైలు పూర్తిగా వెళ్లిపోయిన తరువాత.. కేశవ కంగారు పడతాడు. నిజంగానే వెళ్లిపోయిందా అని షర్ట్ మార్చుకుని శైలు వెనక పరిగెడతాడు.నువ్వు దూరం అయితే.. శైలు వెనకాలే కేశవ వెళ్తుంటాడు. ఎందుకు నా వెనకాల వస్తున్నావ్ అని శైలు అడిగితే.. నువ్వే నా ముందు నడుస్తున్నావ్ అని కేశవ అంటాడు. ఇంకా ఎందుకు దాచి పెడతావ్.. నేనంటే నీకు ఇష్టం.. నన్ను ప్రేమిస్తున్నావ్.. ఆ సంగతి నాకు తెలుసు అని శైలు అంటుంది. అది ప్రేమే ఏమో నాకు తెలీదు.. కానీ నీకు పెళ్లి అని తెలిసినప్పుడు క్షణం పాటు గుండె ఆగిపోయింది.. నువ్వు దూరం అవుతున్నావ్ అనే ఆలోచన వస్తే ఏదోలా అయిపోయింది అని కేశవ అంటాడు. దాన్నే ప్రేమ అంటారు అని శైలు అంటుంది.ప్రేమ ప్రయాణం మొదలు.. నాకు ప్రేమించడం రాదు.. కోప్పడతాను.. బుజ్జగించడం రాదు.. అలకలు తీర్చడం రాదు.. ఇవన్నీ నాకు తెలియవు అని కేశవ అంటాడు. ఏం తెలియకపోయినా పర్లేదు.. అన్నీ నేర్పిస్తాను అని శైలు అంటుంది. నన్ను ప్రేమిస్తున్నావ్ అని నాకు అర్థమైంది అని కేశవను హత్తుకుంటుంది శైలు. ఇంకో వైపు హాస్టల్లో శైలుకి సారీ కార్డులు మెంటల్ ఎక్కిస్తారు. సెక్యూరిటీ గార్డు నుంచి హాస్టల్లో ఉన్న ప్రతీ ఒక్కరూ మహాకి సారీ కార్డుల్ని ఇస్తారు. మంచివాడిలా ఉన్నాడు.. క్షమించొచ్చు కదా? అని అందరూ రిక్వెస్ట్ చేస్తుంటారు. దీంతో మహా మొత్తం చక్రి గురించే ఆలోచిస్తుంటుంది.ప్రేమలో మునిగిన కేశవ, శైలు.. ఇంకో వైపు కన్నా గాడికి ఫీవర్ ఎక్కువ అవుతుంది. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో పెద్ది సేవలు చేస్తుంటాడు. అయితే జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో కేశవకు ఫోన్ చేయాలని పెద్ది అనుకుంటాడు. ఇక్కడేమో కేశవ, శైలు ప్రేమలో తేలుతూ ఉంటారు. మనం మొదట్లో కలిసి ఉన్నా తర్వాత విడిపోతాం అని ఈ జాతకం చెబుతుందని చేతిని పట్టుకుని శైలు చెబుతుంది. అలా ఏం జరగదు అని కేశవ అంటాడు. ఇంత ప్రేమ పెట్టుకుని, ఇన్ని రోజులు నన్ను ఎందుకు తిప్పుకున్నావ్ అని శైలు అంటుంది. అది ప్రేమ అని నాకు ఇన్ని రోజులు తెలీదు కదా అని కేశవ అంటాడు.నాకు తగ్గట్టుగా మార్చుకుంటా.. మరి మీ నాన్న చూపించిన వాడ్ని ఏం చేస్తావ్ అని శైలుని కేశవ అడుగుతాడు. ఇక తన నాటకం అంతా కూడా శైలు చెప్పేస్తుంది. ఇదంతా నాటకమా? అని శైలు చేతుల్ని విరిచి పట్టుకుంటాడు. నీ ప్రేమను బయట పెట్టేందుకు చిన్న ప్రయత్నం.. నన్ను వదలవా? అని శైలు అంటుంది. చివరకు శైలు విడిపించుకుని కేశవకు ముద్దు పెట్టాలని చూస్తుంది. ఇంతలో పెద్ది ఫోన్ వస్తుంది. కేశవ వెళ్లిపోతాడు. నా కోసం ఆగకుండా వెళ్లిపోతాడా? నాకు తగ్గట్టుగా ఎలా మార్చుకుంటానో చూడు.. ఇప్పుడే కదా జర్నీ మొదలైంది అని శైలు తనలో తాను అనుకుంటుంది.చక్రి ఆలోచనల్లో మహా.. చక్రి సారీ మహాని డిస్టర్బ్ చేస్తుంటుంది. దివ్య వచ్చి.. అతని గురించే ఆలోచిస్తున్నావా? డిస్టర్బ్ చేస్తున్నాడా? నువ్వే డిస్టర్బ్ అవుతున్నావా? అని అంటుంది.. అతను ఎంతలా ప్రేమిస్తున్నాడో.. అంతలా సారీ చెబుతున్నాడు అని దివ్య అంటుంది. అది ప్రేమ కాదు.. క్షమించరాని తప్పు చేశాడు.. అందుకే సారీ చెబుతున్నాడు అని మహా అంటుంది. ఇక మహాకి మాత్రం చక్రి వచ్చి సారీ చెప్పినట్టుగానే అనిపిస్తుంది. కిటికీల్లోంచి చూస్తే చక్రి కనిపిస్తాడు. మళ్లీ కళ్లు తుడ్చుకుని చూస్తే చక్రి ఉండడు. అంటే చక్రి దెబ్బకు మహా డిస్టర్బ్ అయినట్టుగా కనిపిస్తోంది.చక్రిని తిట్టిన పెద్ది.. చక్రి ఇంట్లో ఒంటరిగా ఫోన్లో మహా ఫోటోలు చూస్తుంటాడు. ఇంతలో కన్నాని హాస్పిటల్ నుంచి పెద్ది, కేశవ తీసుకు వస్తారు. ఎటు వెళ్లారు?అని చక్రి అంటాడు. దీంతో పెద్దికి కోపం వస్తుంది. అసలు నువ్వు ఏం రాచకార్యాలు వెలగబెట్టడానికి బయటకు వెళ్లావ్.. కన్నాని చూసుకుంటాను అని చెప్పావ్ కదా.. ఇదేనా చూసుకోవడం.. ఈ మాత్రం కూడా చేయలేవా? అని పెద్ది తిడతాడు. ఫోన్ చేసి చెప్పొచ్చు కదరా కన్నా అని చక్రి అంటాడు. నువ్వంటేనే నాకు ఇష్టం లేదు.. నువ్వొక రౌడీవి.. అందుకే వదిన వెళ్లిపోయింది అని కన్నా అంటాడు.వీడు మారడు.. కన్నా మాటలకు చక్రికి కోపం వస్తుంది. ఏరా కొడతావా? వాడి మీద చేయి వేస్తే ఆ చెయ్యి ఉండదు అని కేశవ ఫైర్ అవుతాడు. ఇలా ఈ ఇద్దరూ తిట్టుకోవడం చూసి పెద్ది మరింతగా కోప్పడతాడు. వీడు మారడు.. మహా మన ఇంటికి రాదు.. అని పెద్ది అంటాడు. కన్నా గాడు అన్నట్టుగానే ఆమె కూడా నిన్ను తిట్టి పోయింది.. పెద్ద తేడా ఏం లేదు అని కేశవ అంటాడు. అలా చక్రిని అందరూ కలిసి తిట్టేస్తుంటారు. నా టైం బాగా లేదు.. గ్రహాలు అనుకూలించడం లేదు.. మీరు వదులుతారా? అని బయటకు వెళ్లిపోతాడు చక్రి.కదిలి వచ్చిన మహా.. కన్నా గాడు ఏడుస్తూ మహాకి ఫోన్ చేస్తాడు. జ్వరం వచ్చింది.. ఎవ్వరూ పట్టించుకోలేదు.. ఇప్పుడు పెద్దన్నయ్య వచ్చి హాస్పిటల్కి తీసుకు వెళ్లాడు.. ఇల్లు మునుపటిలా మారింది.. ఏం నచ్చడం లేదు.. నా కోసం అయినా రా వదిన అని కన్నా ఏడ్చేస్తాడు. రావాలనే ఉంది రా కానీ అని మహా చెప్పే లోపు కన్నా ఫోన్ కట్ చేస్తాడు. దీంతో ఉదయాన్నే ఫ్రూట్స్ పట్టుకుని మహా వస్తుంది. మహా రాకను చూసి నారాయణ సంతోషిస్తాడు. మహాని చూసి నారాయణ గుంజీళ్లు తీస్తాడు. తప్పుడు సలహా ఇచ్చాను కదా.. అందుకే చేస్తున్నా అని నారాయణ అంటాడు. మీరు ఎప్పుడైనా మంచి సలహా ఇచ్చారా? అని మహా అంటే.. నాకు నీలాంటి అమ్మ లేదు.. చిన్నప్పుడే చనిపోయింది అని నారాయణ అంటాడు. ఉండటానికి రాలేదు.. కన్నాని చూసి వెళ్లడానికి వచ్చా అని చెప్పడంతో ఎపిసోడ్ పూర్తవుతుంది.