
సాధారణంగా గోడ గడియారం బ్యాటరీ, విద్యుత్తు, సౌర విద్యుత్తుతో పని చేస్తాయి. వీటికి భిన్నంగా గోమూత్రాన్ని ఎలక్ట్రోలైట్‌గా ఉపయోగిస్తూ గడియారం తిప్పుతున్నారు
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంటలోని శ్రీగోపాల కృష్ణ గోశాల ప్రతినిధులు. ‘గడియారం తిరగడానికి రెండు ప్లాస్టిక్ డబ్బాలను ఒక్కోటి చెరో లీటరు గోమూత్రంతో నింపాలి. డబ్బాలో ఒక కాపర్, ఒక జింక్ కడ్డీ చొప్పున రెండు డబ్బాల్లో వేర్వేరుగా పెట్టాలి. ఒక డబ్బాలోని కాపర్ కడ్డీని మరో డబ్బాలోని జింక్ కడ్డీని తీగతో కలపాలి. తర్వాత ఒక డబ్బాలో విడిగా ఉన్న జింక్ కడ్డీ నుంచి ఒక తీగ లాగి గడియారంలోని ఒక టెర్మినల్‌కు, మరో డబ్బాలోని కాపర్ కడ్డీ నుంచి తీగ లాగి గడియారంలోని మరో టెర్మినల్‌కు కనెక్షన్ ఇవ్వాలి. అంతే.. గడియారం పనిచేస్తుంది’ అని గోశాల ప్రతినిధులు పరిమి వెంకట రాఘవులు, గద్దే వెంకట రత్నాజీ వివరించారు. ఒకసారి గోమూత్రంతో డబ్బాలను నింపితే గడియారం 14 రోజులు పని చేస్తుందని తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.