
రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), భారతి ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సునీల్ భారతి...
రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ కల్పించడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), భారతి ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సునీల్ భారతి మిట్టల్ (Sunil Bharti Mittal)తో అమరావతిలో క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చివరి మైలు ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ (Mobile tower) కనెక్టివిటీ పెంపు, డేటా సెంటర్ల (Dta centers)లో పెట్టుబడులు, సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే రాష్ట్రంలో మొబైల్ సేవల సంస్థలకు మరింత అనుకూలమైన వ్యాపార వాతావరణం కల్పించే చర్యలపై ఇరువురు అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశంతో రాష్ట్రంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసి, ప్రజలకు నాణ్యమైన కనెక్టివిటీ అందించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు.