భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి అగ్రస్థానంలో నిలుస్తారు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా లేని ఏకైక అపజయమెరుగని దర్శకుడిగా ఆయన...
భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి అగ్రస్థానంలో నిలుస్తారు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా లేని ఏకైక అపజయమెరుగని దర్శకుడిగా ఆయన రికార్డు సృష్టించారు. రాజమౌళి సినిమా రూపకల్పనకు సమయం ఎక్కువ తీసుకున్నప్పటికీ, అది వెండితెరపైకి వస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయం. ప్రస్తుతం ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలోనే జక్కన్న ఖాతాలో మరో అంతర్జాతీయ స్థాయి అరుదైన గౌరవం చేరింది. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రాజమౌళిని అక్కడి ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అత్యున్నత రీతిలో సత్కరించింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ప్రఖ్యాత 'సినెమాథెక్ ఫ్రాన్సైస్' (Cinémathèque Française) సంస్థకు చెందిన చారిత్రక హెన్రీ లాంగ్లోయిస్ హాల్లో రాజమౌళి పేరిట ఒక 'శాశ్వత సీటు'ను కేటాయించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, దిగ్గజ ఫ్రెంచ్ దర్శకుడు కోస్టా గావ్రాస్ ఆధ్వర్యంలో జక్కన్నకు ఈ అరుదైన గౌరవాన్ని అందించారు. ఈ చారిత్రక సంస్థలో రాజమౌళి రూపొందించిన చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శించడం విశేషం.* రోజుకి లక్ష రూపాయలా?... టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ క్రేజ్! ఉద్వేగానికి లోనైన రాజమౌళితనకు దక్కిన ఈ అసాధారణ గౌరవంపై రాజమౌళి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. " పారిస్ నగరంలో నా సినిమాలను ప్రదర్శించడమే కాకుండా, నన్ను ఇక్కడికి ఆహ్వానించడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. అయితే, హెన్రీ లాంగ్లోయిస్ హాల్లో నా పేరిట శాశ్వత స్థానాన్ని కల్పించడం నేను అస్సలు ఊహించని ఒక మధురమైన ఆశ్చర్యం. ఈ అనుభూతిని మాటల్లో వ్యక్తపరచడం నా వల్ల కావడం లేదు" అని పేర్కొన్నారు. ప్రపంచ సినిమా చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థలో తనకు చోటు దక్కడం జీవితాంతం గుర్తుండిపోతుందని, భారతీయ సినిమాపై ఎంతో ఆదరణ చూపిన లెజెండరీ దర్శకుడు కోస్టా గావ్రాస్తో పాటు సినెమాథెక్ ఫ్రాన్సైస్ బృందానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా ఖ్యాతి సినీ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఇలాంటి అంతర్జాతీయ సంస్థలో ఒక భారతీయ ప్రాంతీయ దర్శకుడికి శాశ్వత గౌరవం దక్కడం ఇదే మొదటిసారి కావడం విశేషం. రాజమౌళి సాధించిన ఈ అంతర్జాతీయ మైలురాయి పట్ల టాలీవుడ్ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో గ్లోబల్ లెవెల్లో తెలుగు సినిమా జెండా పాతిన జక్కన్న, రాబోయే 'వారణాసి' చిత్రంతో ప్రపంచ సినిమాను ఏ రేంజ్లో షేక్ చేయబోతున్నారోనని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.