
ఇక్కడ చిత్రాల్లో కనిపిస్తున్నవి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమకోటలోని ఆదిమానవుల సమాధులు. ఇది పోలవరం ముంపు ప్రాంతం కావడంతో పురావస్తుశాఖ తవ్వకాలు జరిపి అందులో లభించిన సంపదను పరిరక్షించి...
ఇక్కడ చిత్రాల్లో కనిపిస్తున్నవి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం రుద్రమకోటలోని ఆదిమానవుల సమాధులు. ఇది పోలవరం ముంపు ప్రాంతం కావడంతో పురావస్తుశాఖ తవ్వకాలు జరిపి అందులో లభించిన సంపదను పరిరక్షించి మ్యూజియాల్లో భద్రపరుస్తోంది. ఈ సమాధుల్లో గుప్తనిధులు ఉంటాయని భావించిన కొందరు అక్రమార్కులు రాత్రివేళల్లో తవ్వేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ చిత్రాలు. ఈ విషయాన్ని పురావస్తుశాఖ ఏడీ తిమ్మరాజు దృష్టికి తీసుకెళ్లగా బృహత్ శిలాయుగం నాటి 72 సమాధులను 2018లో గుర్తించి తవ్వకాలు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం తవ్వకాలు చేపట్టలేదన్నారు. అనధికారిక తవ్వకాలపై చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో చేపట్టిన తవ్వకాల్లో పావురం, తాబేలు మొదలైన బొమ్మలు, మట్టిపాత్రలు, పూసలు లభించాయని చెప్పారు. మరికొన్ని సమాధులను గుర్తించామని వాటిని తవ్వేందుకు రూ.32 లక్షలు మంజూరయ్యాయని, త్వరలోనే ఆ పనులు చేపడతామన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.