
సౌదీ అరేబియాలోని రాస్ తానూరాలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 14 మంది మృతి చెందారు. ఈ హెలికాప్టర్‌ను సౌదీ చమురు దిగ్గజం అరామ్కోకు చెందినదిగా గుర్తించారు. ఘటనా స్థలిలో అధికారు
లు సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కుప్పకూలిన హెలికాప్టర్.. 14 మంది మృతి |