
లండన్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. కీలక బ్యాటర్ స్మృతి మంధాన (38; 37 బంతుల్లో 6 ఫోర్లు) రనౌట్ అయింది. జెమీమా రోడ్రిగ్స్‌తో సమన్వయలోపంతో పెవిలియన్ చేరింది.
జార్జియా వేర్హమ్ వేసిన బంతిని (11.3 ఓవర్) జెమీమా రోడ్రిగ్స్ ఎదుర్కొంది. నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న మంధాన రన్ కోసం చాలా ముందుకు రాగా.. జెమీమా ఈ విషయాన్ని గమనించలేదు. ఈ క్రమంలో మంధాన రనౌటైంది. 12 ఓవర్లకు భారత్ స్కోరు 85/2. హర్మన్‌ప్రీత్ (1), జెమీమా (9) క్రీజులో ఉన్నారు.
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 74 పరుగులు చేసింది. షెఫాలి వర్మ (34; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించింది. షెఫాలిని సోఫీ మోలినెక్స్ పదో ఓవర్లో వెనక్కి పంపింది. దీంతో 66 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం జెమీమా రోడ్రిగ్స్ (7), మంధాన (31) క్రీజులో ఉన్నారు.
మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో భారత ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసేసరికి టీమ్ఇండియా 36/0 స్కోరుతో నిలిచింది. స్మృతి మంధాన (20), షెఫాలి వర్మ (15) పరుగులతో ఉన్నారు.
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అత్యంత కీలకమైన, కఠినమైన పోరుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఆరు పాయింట్లతో ఉన్న హర్మన్‌ప్రీత్ సేన.. మరికాసేపట్లో భీకర ఆస్ట్రేలియా జట్టును ఢీకొనబోతోంది. టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఘనవిజయాలు సాధించిన ఆసీస్.. భారత్ చేతిలో ఓడినా సెమీస్ చేరే అవకాశముంది. నెట్ రన్‌రేట్ (+4.724)లో ఎంతో మెరుగ్గా ఉండడం వల్ల ఆస్ట్రేలియాకు సానుకులాంశం. ఈ మ్యాచ్‌లో ఓడితే టీమ్ఇండియా ఇంటిముఖం పడుతుంది. ఆస్ట్రేలియా (8 పాయింట్లు), దక్షిణాఫ్రికా (8 పాయింట్లు) సెమీస్ బెర్తులను ఖరారు చేసుకుంటాయి.
భారత్ తుది జట్టు: స్మృతి మంధాన, షెఫాలి వర్మ, యస్తిక భాటిమా, హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తిశర్మ, రాధా యాదవ్, శ్రీచరణి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్.
ఆస్ట్రేలియా తుది జట్టు: బెత్ మూనీ, జార్జియా వాల్, లిచ్‌ఫీల్డ్, ఎలీసా పెర్రీ, ఆష్లీ గార్డ్నర్, జార్జియా వేర్హమ్, అనాబెల్ సూథర్లాండ్, నికోలా కేరీ, సోఫీ, కిమ్ గార్త్, లూసీ హామిల్టన్.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
హైదరాబాద్: టీజీ20 లీగ్ 2026లో కరీంనగర్ డైమండ్స్ బోణీ చేసింది. ఆదివారం ఉప్పల్ వేదికగా వరంగల్ వారియర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యఛేదనలో వరంగల్ 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది.